హీరో, విలన్ ఏ క్యారెక్టర్ అయినా సౌకర్యవంతంగానే ఉంటుంది – ఆది పినిశెట్టి

Aadhi Pinisetty Opens Up About His Roles,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Aadhi Pinisetty,Hero Aadhi Pinisetty,Aadhi Pinisetty Latest Movie Udpates,Aadhi Pinisetty About His Roles in Movies,Aadhi Pinisetty New Movie Updates, Aadhi Pinisetty Upcoming Movies,Aadhi Pinisetty New Movies,Aadhi Pinisetty Opens on his Roles in Movies,Aadhi Pinisetty latest News and Updates, Aadhi Pinisetty Movies,Aadhi Pinisetty Super hit Movies,Aadhi Pinisetty about Villain Roles in Movies

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి జంటగా ఫ్యాక్షన్ నేపథ్యం లో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ది వారియర్ ” మూవీ జూలై 14 వ తేదీ రిలీజ్ అయ్యి విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన “ది వారియర్”మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.డాక్టర్​గా, పోలీస్​గా, లవర్​గా రామ్​ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఆర్జే విజిల్ మహాలక్షిగా నటించిన కృతిశెట్టి తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో రామ్ , విలన్ ఆది పినిశెట్టి పోటాపోటీ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న “ది వారియర్ ” మూవీ గురించి ఆది పినిశెట్టి మాట్లాడుతూ .. “సరైనోడు”, “అజ్ఞాతవాసి” చిత్రాల్లో విలన్‌గా నటించాననీ , ఆ తర్వాత వచ్చే విలన్‌ క్యారెక్టర్‌ వాటికంటే గొప్పగా ఉండాలనుకున్నాననీ , “ది వారియర్‌” కథ విన్నప్పుడే పవర్‌ఫుల్‌ విలనీ కనిపించిందనీ , దర్శకుడు లింగుస్వామి విలన్‌ గురు పాత్రను కొత్త పంథాలో డిజైన్‌ చేశారనీ , ఆరంభం నుంచి ముగింపు వరకు గురు పాత్ర ఒకే ఇంటెన్సిటీతో సాగుతుందనీ , మేకప్‌ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాననీ , చెవికి దిద్దు పెట్టుకోవడంతో పాటు లెన్స్‌ కూడా వాడాననీ , పాత్ర నచ్చితే చాలు, హీరో అయినా, విలన్‌ అయినా..రెండు పాత్రలు తనకు సౌకర్యవంతంగానే అనిపిస్తాయనీ , కథలో కొత్తదనంతో పాటు తన పాత్ర ఛాలెంజింగ్‌గా అనిపించాలనీ , ఏ క్యారెక్టర్‌ చేసినా ప్రేక్షకులకు గుర్తుండిపోతే చాలనుకుంటాననీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + five =