బాలీవుడ్ ఎంట్రీ పై అల్లు అర్జున్ కామెంట్స్

Allu Arjun Comments about his Bollywood Entry

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. “పుష్ప: ది రైజ్” మూవీ హిందీ వెర్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుని 100 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ సెకండ్ పార్ట్ “పుష్ప :ది రూల్ ” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“పుష్ప;ది రైజ్”మూవీ తో అల్లు అర్జున్ కు బాలీవుడ్ లో క్రేజ్ పెరిగింది. బాలీవుడ్ టాప్ నిర్మాత , దర్శకులు అల్లు అర్జున్‌తో సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో తన బాలీవుడ్ ఎంట్రీ పై అల్లు అర్జున్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. హిందీ సినిమాల్లో న‌టించే ఆలోచ‌న ఇప్ప‌ట్లో లేద‌నీ , ప్ర‌జెంట్ బాలీవుడ్ సినిమాల్ని తన కంఫర్ట్ జోన్ గా భావించ‌డం లేద‌నీ , ఒక‌వేళ బాలీవుడ్ లో అడుగుపెట్టాల‌ని ఫిక్స్ అయితే పూర్తిగా ఆ సినిమాల పైనే దృష్టిసారిస్తాన‌నీ , అయితే అది ఎప్పుడ‌న్న‌ది చెప్ప‌లేన‌నీ అల్లు అర్జున్ చెప్పారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.