ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 99
'ది ఫ్యామిలీ మ్యాన్ 2' టీజర్ రిలీజ్

మాళవిక శర్మ ట్రెడిషినల్ లుక్
ఉప్పెన 'టీజర్' రిలీజ్
'తలైవా' ఫ్యాన్స్ కు లారెన్స్ సారీ
'మాస్టర్' చూస్తున్న 'మహానటి'
కార్తీక్ సాయి 'సైకో' టీజర్ రిలీజ్
రామ మందిర్ ట్రస్ట్ కు ప్రణీత విరాళం
రామ్ 'రెడ్' థ్రిల్లర్ మాత్రమే కాదు..!
రకుల్ ప్రీత్ స్వీట్ మెమొరీ
బెల్లీ డ్యాన్సర్ జాన్వీ కపూర్
యాక్షన్ ఎంటర్ టైనర్ "లక్ష్మీ "

'కపటధారి' ట్రైలర్ రిలీజ్

విజయ్ సేతుపతి - కత్రినా కాంబినేషన్లో సినిమా..?

సునీత-రామ్ కు నాగబాబు విషెస్
అమృత అయ్యర్ డబుల్ ధమాకా
స్మిమ్మర్ కాని స్విమ్మర్ నభా నటేష్
“పెళ్ళిసందD” మూవీలో హీరోయిన్ ఫిక్స్
తమన్నా మిడ్ నైట్ వర్కౌట్
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న తమన్నా పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్ "లో కథానాయికగా నటిస్తున్న తమన్నా ప్రస్తుతం "గుర్తుందా శీతాకాలం "మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధున్" మూవీ తెలుగు రీమేక్ లో ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. బ్లాక్ బస్టర్ "F 2 "మూవీ సీక్వెల్ "F 3 "మూవీలో తమన్నా కథానాయికగా నటిస్తున్నారు.
'ది ఫ్యామిలీ మ్యాన్ 2' టీజర్ రిలీజ్
మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ద ఫ్యామిలీ మ్యాన్'. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ కూడా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. తెలుగు దర్శకులు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకేలు ఈ వెబ్ సిరీస్‌ను దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఓ టెర్రరిస్ట్ పాత్రలో సమంత నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇటీవలే ఈ సిరీస్ రిలీజ్ డేట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 12న హిందీ, తెలుగు మరియు తమిళ్ భాషల్లో ఈ సిరీస్ రిలీజ్ కానుంది.

మాళవిక శర్మ ట్రెడిషినల్ లుక్
స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “RED” మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది.ఈ మూవీ లో నివేత పేతురాజ్ , మాళవిక శర్మ , అమృత అయ్యర్ కథానాయికలు. సంపత్ రాజ్ , నాజర్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.
ఉప్పెన 'టీజర్' రిలీజ్
సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా వల్ల రిలీజ్ కాస్త వాయిదా పడింది. లాక్ డౌన్ టైం లో చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి కానీ’ఉప్పెన’ మాత్రం ఓటీటీకి నో చెప్పింది. ఇక పాటలతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ కు చేరిపోయాయి. మరోపక్క ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
"మోసగాళ్ళు "సంక్రాంతి పోస్టర్ రిలీజ్
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , ఎ వి ఎ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా అతి పెద్ద ఐటి స్కామ్ నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా భారీ బడ్జెట్ తో "మోసగాళ్ళు " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ , రూహి సింగ్ , నవదీప్ , నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటిస్తుండగా , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి ACP కుమార్ గా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
'తలైవా' ఫ్యాన్స్ కు లారెన్స్ సారీ
ఎంతో కాలంగా రజినీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని అభిమానులతో పాటు అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో తాను రాజకీయాల్లోకి రానని చెప్పి అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాల కారణంగా రాజకీయాల్లోకి రావడం లేదని .. తానిచ్చిన మాటను వెనక్కి తీసుకోవడంపై తనను క్షమించాలంటూ అభిమానులను కోరారు. రాజకీయ ప్రకటనకు ముందు ఆసుపత్రిలో తాను చేరడమనేది దేవుడి హెచ్చరికగా భావిస్తున్నట్టు లేఖలో తెలిపారు. ఇక రజినీ తీసుకున్న నిర్ణయంపై కొంతమంది హర్షం వ్యక్తం చేసినా.. కొంతమంది అభిమానులు మాత్రం నిరాశచెందారు. అంతేకాదు.. తలైవా తన నిర్ణయం మార్చుకోవాలని నిరసనలు కూడా చేశారు. ఇక దానిపై స్పందించిన రజినీ తాను రాజకీయాల్లోకి…
'మాస్టర్' చూస్తున్న 'మహానటి'
దాదాపు ఎనిమిది నెలలు వరకు థియేటర్ మొహం చూసే అవకాశం కోల్పోయారు సినీ లవర్స్. అప్పుడప్పుడు సినిమా చూసే వాళ్ళకి పెద్దగా డిఫరెన్స్ ఉండకపోయినా సగటు సినీ ప్రేక్షకుడికి మాత్రం ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఏంటో తెలుస్తుంది. ఎన్ని ఆన్ లైన్ సైట్ లు ఉన్నా.. ఎన్ని ఓటీటీ వేదికలు ఉన్న థియేటర్ లో సినిమా చూస్తే ఆ కిక్కే వేరు. ఇక లాక్ డౌన్ తరువాత థియేటర్స్ కూడా ఎలాగోలా తెరుచుకున్నాయి. వరుసగా సినిమాలు రిలీజ్ అవుతుండడంతో జనాలు మెల్లగా థియేటర్స్ కు అలవాటు పడుతున్నారు. ఇక సెలబ్రెటీలు కూడా థియేటర్స్ కు వచ్చేస్తున్నారు.
కార్తీక్ సాయి 'సైకో' టీజర్ రిలీజ్
చిన్నా దర్శకత్వంలో కార్తీక్ సాయి, డాలీషా, నేహా దేశ్ పాండే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ”సైకో”. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ టీజర్ ను విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో అల్లుడు అదుర్స్ సినిమా నిర్మాతలు గొర్రెల సుబ్రమణ్యం, గంజి రమేష్, సురేష్ కొండేటి లతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
రామ మందిర్ ట్రస్ట్ కు ప్రణీత విరాళం
బ్లాక్ బస్టర్ తెలుగు మూవీ "పోకిరి "కి కన్నడ రీమేక్ గా రూపొందిన సూపర్ హిట్ "పొర్కి " మూవీ తో ప్రణీత సుభాష్ కెరీర్ ప్రారంభించారు. "ఏం పిల్లో ఏం పిల్లడో"మూవీ తో టాలీవుడ్ , "ఉదయన్ " మూవీ తో కోలీవుడ్ కు ప్రణీత పరిచయం అయ్యారు. కన్నడ , తమిళ భాషల సూపర్ హిట్ మూవీస్ లో కథానాయికగా నటించిన ప్రణీత "అత్తారింటికి దారేది ", "పాండవులు పాండవులు తుమ్మెద ", "హలో గురు ప్రేమకోసమే "వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు.
"విరాటపర్వం"సంక్రాంతి పోస్టర్ రిలీజ్
సురేష్ ప్రొడక్షన్స్ , ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ "నీదీ నాదీ ఒకే కథ "మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా 90 నాటి తెలంగాణ నక్సల్ మూమెంట్ నేపథ్యంలో వాస్తవ సంఘటనలతో రూపొందిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ "విరాట పర్వం "మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. హీరో రానా కామ్రేడ్ రవన్న గా నటించిన ఈ మూవీ లో ప్రియమణి, నందితాదాస్ , నివేత పేతురాజ్ ముఖ్య పాత్రలలో నటించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.
రామ్ 'రెడ్' థ్రిల్లర్ మాత్రమే కాదు..!
కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్న సినిమా 'రెడ్ '. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తడమ్’ చిత్రానికి రీమేక్‌గా ‘రెడ్’ తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్‌లుక్, ట్రైలర్‌లతో పాటు ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్‌లో నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. థియేటర్లు తిరిగి ప్రారంభం కావడంతో ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారు.
రకుల్ ప్రీత్ స్వీట్ మెమొరీ
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా తండ్రీ కొడుకుల ఎమోషన్ నేపథ్యం లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "నాన్నకు ప్రేమ తో"మూవీ 2016 సంవత్సరం జనవరి 13 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. జగపతి బాబు , రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. హీరోఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు.
బెల్లీ డ్యాన్సర్ జాన్వీ కపూర్
బ్లాక్ బస్టర్ "ధడక్" మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయిన లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్, ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ "మూవీ లో ఫైటర్ పైలట్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి జాన్వీ ప్రేక్షకులను అలరించారు. జాన్వీ కథానాయికగా నటించిన "రుహి అఫ్జానా" మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. "దోస్తానా 2" మూవీ లో జాన్వీ కథానాయికగా నటిస్తున్నారు.
యాక్షన్ ఎంటర్ టైనర్ "లక్ష్మీ "
శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై వి వి వినాయక్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "లక్ష్మీ " మూవీ 2006 సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. నయనతార , ఛార్మి కథానాయికలు కాగా శర్వానంద్ , రాజీవ్ కనకాల , బ్రహ్మానందం , సునీల్ , వేణు మాధవ్ ముఖ్య పాత్రలలో నటించారు. రమణ గోగుల సంగీతం అందించారు. "లక్ష్మీ " మూవీతో నయనతార కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.

'కపటధారి' ట్రైలర్ రిలీజ్
ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో సుమంత్ ఇప్పుడు 'కపటధారి' అనే మరో డిఫరెంట్ కథతో వస్తున్న సంగతి తెలిసిందే. కన్నడంలో సూపర్‌హిట్టయిన `కవలుదారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్. కన్నడలో రిషి పోషించిన ట్రాఫిక్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో సుమంత్ నటించారు. అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

విజయ్ సేతుపతి - కత్రినా కాంబినేషన్లో సినిమా..?
హీరోగానే కాకుండా అన్ని రకాల పాత్రలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే వైవిధ్యమైన నటుడిగా గుర్తుంపు తెచ్చుకున్నారు విజయ్. విజయ్ సేతుపతి కోసం డైరెక్టర్స్ ప్రత్యేకమైన పాత్రలు రాసే స్థాయికి ఎదిగాడు. అంతేకాదు కేవలం ఒక్క భాషకే అంకితం కాకుండా.. పలు భాషల్లో నటిస్తూ తన సత్తా చాటుతున్నాడు. తమిళ్ లో పలు సినిమాలు చేస్తూనే ఇతర లాంగ్వేజస్ లో చేస్తున్నాడు. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆయన తెలుగులో ‘ఉప్పెన’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

సునీత-రామ్ కు నాగబాబు విషెస్
సింగర్ సునీత, డిజిటల్ కంపెనీ అధినేత రామ్ వీరపనేని వివాహం రెండు రోజుల క్రితం జరిగిన సంగతి తెలిసిందే కదా. శంషాబాద్ దగ్గరలోని అమ్మపల్లిలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం వేదికగా వీరి పెళ్లి జరిగింది. ఘనంగా జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు, శ్రేయోభిలాషులు.. టాలీవుడ్ నుండి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
అమృత అయ్యర్ డబుల్ ధమాకా
కామర్స్ డిగ్రీ హోల్డర్, మోడల్ అమృత అయ్యర్ "పడై వీరన్"తమిళ మూవీ తో కథానాయికగా కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ "బిగిల్ "తమిళ మూవీ తో అమృత గుర్తింపు పొందారు. స్టార్ యాంకర్ ప్రదీప్ హీరోగా రూపొందిన "30 రోజులలో ప్రేమించడం ఎలా ?" మూవీ లో అమృత కథానాయికగా నటించారు. ఆమూవీ జనవరి 29 వతేది రిలీజ్ కానుంది. అనూప్ రూబెన్స్ స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
స్మిమ్మర్ కాని స్విమ్మర్ నభా నటేష్
భరత నాట్యం డ్యాన్సర్ , మోడల్ నభా నటేష్ సూపర్ హిట్ "వజ్రకాయ "కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. "నన్ను దోచుకుందువటే "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నభా నటేష్ బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని హీరోయిన్ గా గుర్తింపు పొందారు. సూపర్ హిట్ "సోలో బ్రతుకే సో బెటర్ "మూవీ లో అమృత పాత్రలో తన పెర్ఫార్మెన్స్ తో నభా నటేష్ ప్రేక్షకులను అలరించారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధున్ " తెలుగు రీమేక్ లో నభా నటేష్ కథానాయికగా ఎంపిక అయ్యారు.
“పెళ్ళిసందD” మూవీలో హీరోయిన్ ఫిక్స్
కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా రూపొందిన “పెళ్ళి సందడి “(1996 ) మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా ప్రేక్షకులను అలరించిన “పెళ్ళి సందడి “మూవీ సీక్వెల్ “పెళ్ళిసందD” మూవీ తెరకెక్కుతుంది. ఆర్కా మీడియా వర్క్స్ సమర్పణలో ఆర్ కె ఫిల్మ్స్ అసోసియేట్స్ బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ లో గౌరీ రోనంకి దర్శకత్వంలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా “పెళ్ళిసందD” మూవీ రూపొందుతుంది.