మనోజ్ బాజ్పెయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ద ఫ్యామిలీ మ్యాన్’. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ కూడా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. తెలుగు దర్శకులు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకేలు ఈ వెబ్ సిరీస్ను దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఓ టెర్రరిస్ట్ పాత్రలో సమంత నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇటీవలే ఈ సిరీస్ రిలీజ్ డేట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 12న హిందీ, తెలుగు మరియు తమిళ్ భాషల్లో ఈ సిరీస్ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సిరీస్ టీజర్ ను రిలీజ్ చేశారు. శ్రీ ఎక్కడున్నావ్ నువ్వు..నా ఫోన్ కాల్ కు ఎందుకు సమాధానమివ్వడం లేదు అంటూ ప్రియమణి ఫోన్ లో మాట్లాడే సన్నివేశాలతో మొదలయ్యే ఈ టీజర్ సస్పెన్స్ గా సాగుతూ.. ఆసక్తిని రేకెత్తిస్తోంది. మనోజ్బాజ్పేయ్ గన్ తో షూట్ చేస్తుండటం..మరోవైపు డార్క్ నైట్ లో సమంత కనిపించడం ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఇక ఈ సందర్భంగా సమంత ట్విట్టర్ లో టీజర్ ను పోస్ట్ చేస్తూ.. నేను ఎక్జయిట్ అయ్యానని తెలుసు. జనవరి 19న ట్రైలర్ మీ ముందుకొస్తుందని ట్వీట్ చేసింది.
I know I am excited 🙂
Trailer out on 19th Jan #TheFamilyManOnPrime @PrimeVideoIN @SrikantTFM @BajpayeeManoj @Priyamani6 @rajndk pic.twitter.com/SsCQVymWZN— Samantha Akkineni (@Samanthaprabhu2) January 13, 2021
ఈ వెబ్ సిరీస్ తో పాటు ఇంకా గేమ్ ఓవర్ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తుంది సమంత. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తుంది. తెలుగులో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: