‘లైగర్’ గా రౌడీ హీరో

Tollywood Crazy Actor Vijay Devarakonda Comes Back As Liger,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vijay Deverakonda,Actor Vijay Deverakonda,Liger,Liger Movie,Liger Film,Vijay Deverakonda Latest Movie Liger,Vijay Deverakonda Latest Movie Liger First Look,Vijay Deverakonda Liger Movie First Look Is Out,Vijay Deverakonda First Look From Liger Out,Vijay Deverakonda New Movie Liger First Look,Liger First Look,Ananya Panday,Vijay Deverakonda Next Film Titled Liger,Puri Jagannadh,Vijay Devarakonda Comes Back As Liger

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముంబై లో కొద్దిరోజులు జరుపుకుంది. ఇక కరోనా వల్ల ఇన్నిరోజులు బ్రేక్ తీసుకోగా ఇప్పుడు మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా టైటిల్ ఫైటర్ కాదని ఇప్పటినే ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన ఛార్మి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫైటర్ అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అని.. అసలైన టైటిల్ వేరే ఉందని ఇంతకుముందే తెలిపింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. “లైగర్” అనే టైటిల్‌ను ఖరారు చేసింది చిత్రయూనిట్. సాలా క్రాస్‌బ్రీడ్‌ అనేది క్యాప్షన్.

కాగా బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించనున్నారు. మరి ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో… పూరీ విజయ్ ను ఎలా చూపిస్తాడో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇక ఈ సినిమా తర్వాత ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ ఫేమ్‌ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. దిల్‌ రాజు నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ వేసవిలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత సుకుమార్‌ డైరెక్షన్‌లో మరో చిత్రం చేయనున్నాడు. 2022లో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 4 =