క్రాక్ పై ‘చిరు’ ప్రశంసలు

Mega Star Chiranjeevi Applauds The Krack Movie Team On Film Success,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Krack,Krack Movie,Krack Film,Krack Movie Telugu,Krack Telugu Movie,Krack Movie Success,Mega Star Chiranjeevi,Chiranjeevi,Mass Maharaja Ravi Teja,Ravi Teja,Chiranjeevi Applauds Krack Movie Team,Mega Star Chiranjeevi Krack Movie Success,Chiranjeevi On Krack Film Success,Chiranjeevi About Krack Movie Success,Chiranjeevi Latest News,Chiranjeevi On Krack

చాలా గ్యాప్ తర్వాత క్రాక్ సినిమాతో వచ్చి సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు మాస్ మహారాజా రవితేజ. మంచి టాక్ ను సొంతం చేసుకోటమే కాకుండా సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతుంది. ర‌వితేజ కెరీర్ లో వ‌న్ ఆఫ్ ది బెగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ క్రాక్ సినిమాపై ప్రశంసలు కురిపించగా.. ఇప్పుడు తండ్రి చిరు కూడా క్రాక్ సినిమాను.. డైరెక్టర్ గోపీచంద్ పై ప్రశంసలు కురిపించినట్టు తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క్రాక్ సినిమా చూసిన తర్వాత చిరంజీవి గారు సినిమా చాలా బావుందని చెప్పారని… సినిమా చిరు సార్ కి బాగా నచ్చిందని.. నా కెరీర్ లో నాకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇదే అని చెప్పారు. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను.. దాని ఫలితమే ఇప్పుడు ఆడియన్స్.. స్టార్స్ నుండి వస్తున్న అప్రిషియేషన్స్ అని చెప్పుకొచ్చాడు.

ఇక అదే జోష్ తో ఇప్పుడు ఖిలాడి సెట్ లో అడుగుపెట్టాడు రవితేజ. రమేష్‌వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేయగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. తాజాగా తాను ఖిలాడి చిత్రీకరణలో జాయిన్ అయిన విషయాన్ని ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు రవితేజ. లైట్స్.. కెమెరా.. యాక్షన్ అంటూ క్యాప్షన్ ఇస్తూ.. ఖిలాడి సెట్‏లో దిగిన సెల్ఫీని తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఇక జనవరి 26న రవితేజ పుట్టినరోజు కావడంతో ఆ తేదీన ఖిలాడి టీజర్‏ను విడుదల చేయడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. సమ్మర్లో ఈ మూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.