గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 9 వ తేదీ రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో, సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటించారు. సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. సంక్రాంతి పండగకు రిలీజ్ అయిన మూవీస్ లో “క్రాక్ ” మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్



పోలీస్ ఆఫీసర్ గా నటించిన హీరో రవితేజ యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. హీరో రవితేజ ప్రస్తుతం ఎ స్టూడియోస్ , పెన్ మూవీస్ బ్యానర్స్ పై రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. హీరో రవితేజ ద్విపాత్రాభినయం తో తెరకెక్కుతున్న “ఖిలాడి “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. “క్రాక్ ” మూవీ ఘనవిజయం సాధించడం తో ఫుల్ జోష్ లో ఉన్న రవితేజ “ఖిలాడి “మూవీ షూటింగ్ లొకేషన్ నుండి లైట్స్ . . యాక్షన్ .. కెమెరా అంటూ తన సెల్ఫీ ని సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆ సెల్ఫీ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. జనవరి 26 వ తేదీ హీరో రవితేజ బర్త్ డే సందర్భంగా “ఖిలాడి “మూవీ టీజర్ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: