సక్సెస్ ఫుల్ “ఒక లైలా కోసం “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూజాహెగ్డే సీనియర్ హీరోలతో పాటు యువ హీరోలకు జంటగా నటిస్తూ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ , “రాధేశ్యామ్ “మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్న విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందనున్న తెలుగు మూవీ , బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్ “కభీ ఈద్ కభీ దివాలీ “, రణ్ వీర్ సింగ్ “సర్కస్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




గోపీకృష్ణా మూవీస్ సమర్పణ లో యు వి క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఫారిన్ లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకున్న “రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో రూపొందించిన ప్రత్యేక సెట్ లో జరుగుతుంది. ఈ షూటింగ్ షెడ్యూల్ ను దర్శకుడు రాధాకృష్ణ 30 రోజులు ప్లాన్ చేశారు. తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసిన పూజాహెగ్డే హైదరాబాద్ నుండి ముంబై కు వెళ్ళిపోయారు. ఆ విషయాన్ని పూజాహెగ్డే ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























