బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కథానాయికగా విబ్రి మీడియా , కర్మ మీడియా &ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఎ ఎల్ విజయ్ దర్శకత్వంలో లెజెండరీ యాక్ట్రెస్ , దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా “తలైవి” మూవీ తమిళ , తెలుగు , హిందీ భాషలలో రూపొందుతుంది. అరవింద్ స్వామి , ప్రకాష్ రాజ్ , భాగ్యశ్రీ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ బయోపిక్ మూవీ కి జి వి ప్రకాష్ కుమార్ , రచిత అరోరా సంగీతం అందిస్తున్నారు. జయలలిత రీల్ లైఫ్ , రియల్ లైఫ్ ముఖ్య సంఘటనలతో తెరకెక్కుతున్న “తలైవి” మూవీకి స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లెజెండరీ పొలిటికల్ లీడర్ జయలలిత బయోపిక్ మూవీ “తలైవి” తమిళనాడు తో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. లెజెండరీ యాక్టర్ , దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి ఎమ్ జి ఆర్ 104 వ జయంతి సందర్భంగా చిత్ర యూనిట్ ఒక కొత్త పోస్టర్ తో పాటు ఎమ్ జి ఆర్ లైఫ్ జర్నీ క్లిప్స్ తో ఒక వీడియో ను రిలీజ్ చేసింది. ఆ వీడియో ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంది. బయోపిక్ మూవీ “తలైవి” పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: