మెగా ప్రిన్స్ ‘గని’

Varun Tej Latest Movie Ghani First Look Poster Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Varun Tej,Hero Varun Tej,Actor Varun Tej,Varun Tej Latest Movie Ghani,Ghani,Ghani Movie,Ghani Film,Ghani Telugu Movie,Ghani Movie Telugu,Ghani Telugu Movie Poster,Ghani First Look Poster Is Out,Ghani Motion Poster,Kiran Korrapati,Renaissance Pictures,Ghani First Look,Varun Tej Ghani,Varun Tej Ghani First Look,Varun Tej Ghani Motion Poster,Motion Poster of Ghani,#HappyBirthdayVarunTej,#HBDVarunTej

మెగా కాంపౌండ్ లో ఉన్న హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఎప్పుడూ డిఫరెంట్ గా సినిమాలు చేయడానికి ఇష్టపడతాడన్న సంగతి తెలిసిందే. మొదటి సినిమా కాస్త అటు ఇటు అయినా ఆ తర్వాత కంచె సినిమాతో ప్రత్యేక గుర్తింపు పొండాదు. ఆ తర్వాత తొలిప్రేమ, ఫిదా, గద్దల కొండ గణేష్, ఎఫ్2 ఇలా వరుస హిట్లతో సూపర్ ఫామ్ లోకి వచ్చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం కిర‌ణ్ కొర్ర‌పాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే కదా. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందన్న సంగతి కూడా విదితమే. ఇక ఈరోజు వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ కు సంబంధించి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ‘గని’ అనే టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారు.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుందని తెలుస్తోంది. ఉపేంద్ర‌, సునీల్ శెట్టి.. లాంటి స్టార్లు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఫాదర్ పాత్రలో ఉపేంద్ర.. కోచ్ పాత్రలో సునీల్ శెట్టి నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు… హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =