మున్నా దర్శకత్వంలో ప్రదీప్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ కరోనా వల్ల ఈ సినిమా రిలీజ్ కూడాఆగిపోయింది. మళ్లీ థియేటర్స్ ఓపెన్ కావడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఇక మొదటినుండి ప్రదీప్ సినిమా కాబట్టి ఈ సినిమాకు హైప్ బాగానే వచ్చింది. ఇక ఇప్పటికే విడుదలైన తొలి సాంగ్ ‘నీలి నీలి ఆకాశం’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఇటీవలే ప్రకటించారు. జనవరి 29న ఈ చిత్రం థియేటర్స్‌లో సందడి చేయనుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ.. ‘ ఇప్పటివరకు డిఫరెంట్ టెలిషోస్ చేశాను. అదొక మంచి ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. యాంకర్ గా ప్రజలందరూ ఆదరించారు. యాక్టర్ అవ్వాలనేది నా కల. అది తీరడానికి పదేళ్లు పట్టింది. మున్నా ఫస్ట్ ఈ కథ చెప్పగానే బాగా నచ్చింది. యస్వీ బాబు గారు గ్రేట్ హంబుల్ పర్సన్. సినిమాకి అన్నీ ప్రొవైడ్ చేసి అన్ కాంప్రమైజ్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. జాబ్ శాటిస్పాక్షన్ తో పాటు జేబు శాటిస్పాక్షన్ కలగాలి. అనూప్ మ్యూజిక్, చంద్రబోస్ గారి లిరిక్స్, శివేంద్ర విజువల్స్ సినిమాకి బిగ్ ఎస్సెట్ అవుతాయి. మున్నా కథ విని చాలా ఎక్సయిట్ అయ్యాను. నా క్యారెక్టర్ అండ్ క్యారెక్టరైజేషన్ బాగా డిజైన్ చేశాడు. సినిమా చూసి ఒక చిరు నవ్వుతో బయటికి వస్తారు.. అని ప్రామిస్ చేస్తున్నా. ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. అన్నీ ఎమోషనల్ సీన్స్ కి కనెక్ట్ అవుతారు. అమృత అయ్యర్ సూపర్బ్ గా పెర్ఫార్మెన్స్ చేసింది. అమ్మ క్యారెక్టర్ లో హేమ చాలా బాగా చేసింది. హర్ష, భద్రం ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.. అన్నారు.
చిత్ర నిర్మాత యస్.వి. బాబు మాట్లాడుతూ.. ‘ ఇటీవల రిలీజ్ అయిన మా చిత్రం ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మా సినిమాకి ఇంతలా క్రేజ్ రావడానికి కారణం అనూప్ ఇచ్చిన మ్యూజిక్. చంద్రబోస్ వన్డ్రఫుల్ లిరిక్స్ రాశారు. వారికి నా అబినందనలు. ఈ నెల 29న వరల్డ్ వైడ్ గా యువి, జిఏ2 ద్వారా సినిమా రిలీజ్ అవుతుంది.. అంత పెద్ద సంస్థలు మా సినిమా విడుదల చేస్తున్నందుకు అదృష్టం గా, గర్వాంగా ఫీలవుతున్నాను. సినిమా చూసిన ప్రేక్షకులు హ్యాపీగా వెళ్తారని గ్యారెంటీగా చెబుతున్నాను.. అన్నారు.
దర్శకుడు ఫణి ప్రదీప్ మాట్లాడుతూ.. ‘ నువ్వేకావాలి, క్షణం, స్వామిరారా’.. చిత్రాల ఇన్స్పిరేషన్ ఈ సినిమా చేయడానికి కారణం. కథ అనుకున్న దెగ్గరునుండి ఇప్పటివరకూ మా హీరో ప్రదీప్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. మా నిర్మాత యస్వీ బాబు గారు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చి ఈ సినిమాని కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. సినిమా చూశాను.. బాగా వచ్చింది. చూసిన మా టీమ్ అంతా కంట తడి పెట్టారు. అంత బాగా కనెక్ట్ అయ్యారు. నీలి నీలి ఆకాశం పాట ఎంత పెద్ద హిట్ అయిందో సినిమా కూడా అంతే హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాం. అనూప్ మ్యూజిక్, చంద్రబోస్ గారి సాహిత్యం బాగా కుదిరింది. వారికి నా థాంక్స్. ఇండస్ట్రీలోని పెద్దలంతా ఫోన్ చేసి నీలి నీలి పాట బాగుందని అప్రిషియేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.. అన్నారు.
సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. ‘ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కావడానికి మెయిన్ రీసన్ యస్వీ బాబు గారు. మున్నా కథ చెప్పగానే బాగా ఇన్స్పైర్ అయ్యాను. కథకు తగ్గట్లుగా స్విచ్ వేషన్స్ సాంగ్స్ కంపోజ్ చేశాను. ఆడియో బిగ్ హిట్ అయింది. అలాగే సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మూవీ చూసి బాగా ఎమోషన్ అయ్యాను. అంతలా కనెక్ట్ అయ్యింది. మా లాగే ప్రతిఒక్కరూ కనెక్ట్ అవుతారు. ప్రదీప్ మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ చేశాడు. హీరోయిన్ అమృత అయ్యర్ బ్యూటిఫుల్ యాక్ట్ చేసింది. చంద్ర బోస్ గారు ఎక్స్ లెంట్ లిరిక్స్ రాశారు.. మా జర్నీ ఇలాగే కొనసాగలి.. అన్నారు.
కాగా అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఇంకా హర్ష చెముడు, భద్రం, హేమ, పోసాని కృష్ణమురళి, ‘శుభలేఖ’ సుధాకర్ కీలక పాత్రల్లో నటించారు. ఎస్.వి.బాబు ఈ చిత్రాన్ని ఎస్.వి. ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించగా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: