మెగా బ్రదర్ నాగబాబు తన ముద్దుల కూతురు నిహారిక పెళ్లి ఇటీవలే జరిపిన సంగతి తెలిసిందే కదా. వరుణ్ తేజ్ దగ్గరుండి చెల్లెలి పెళ్లి చాలా ఘనంగా జరిపించాడు. ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా మూడు రోజుల పాటు పెళ్ళి జరిగింది. ఇక ఆ తర్వాత నాగబాబు టీవీ షోస్ తో బిజీ అవ్వడం.. నిహారిక హానీమూన్ అత్తారింటికి వెళ్లడం.. ఇంకోవైపు వరుణ్ కు కరోనా రావడంతో అందరూ కలుసుకునే ఛాన్స్ లేకుండా పోయింది. ఇక ఇప్పుడు నిహారిక ఇంటికి వచ్చేసింది. వరుణ్ కూడా కోలుకున్నాడు. ఇక ఫ్యామిలీ రిలాక్డ్స్ మూడ్ లోకి వచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా ఫ్యామిలీ మొత్తం సరదాగా తీసుకున్న ఫొటో ఒకటి వరుణ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ ఫొటో అందర్నీ ఆకట్టుకుంటుంది. అందులో అందరూ హ్యాపీగా నవ్వుతూ ఆనందంగా ఉన్నారు.
View this post on Instagram
ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ‘గని’ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే కదా. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాతో పాటు ఎఫ్3 సినిమా కూడా చేస్తున్నాడు వరుణ్. రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























