వలయం వంటి డిఫరెంట్ థ్రిల్లర్ తో ఆకట్టుకున్న లక్ష్ఇప్పుడు మరో విభిన్నమైన కథతో రావడానికి సిద్దమయ్యాడు. ఇషాన్ సూర్య దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ గంగరాజు అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను ఈ రోజు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు షాట్ కు ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాస రావు గారు క్లాప్ ఇచ్చారు.. ఈ రోజు నుండి హైదరాబాద్, అరకు, ప్రాంతాల్లో ఏకధాటిగా జరిగే రెండు షెడ్యూల్స్ లో షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఎవరూ ఊహించని కథతో ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యే అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చె లా ” గ్యాంగ్ స్టర్ గంగరాజు” చిత్రాన్ని రూపొందుస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో దత్తు హీరోయిన్ గా నటిస్తుంది. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. సుప్రీం, రాజా ది గ్రేట్, వంటి వరుస హిట్స్ తో దూసుకుపోతున్న సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇతర నటీనటులు మిగిలిన విషయాలు త్వరలో తెలియచేయనున్నారు.

[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























