తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న రాశీఖన్నా , ప్రస్తుతం 3 తమిళ మూవీ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ఒక తమిళ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ “మలయాళ రీమేక్ మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో రూపొందనున్న మూవీ లో రాశీఖన్నా , సాయి తేజ్ కు జోడీగా ఎంపిక అయ్యారనీ , ఒక హిందీ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
రాశీఖన్నా తన లేటెస్ట్ ఫొటో షూట్ ఫొటోస్ , వర్కౌట్ వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. రాశీఖన్నా ప్రస్తుతం హాలిడే ట్రిప్ గోవా లో ఎంజాయ్ చేస్తున్నారు. సాకు చెప్పకుండా .. ప్రకృతి ఒడి లో ఒక మార్గం కనుక్కోండి అంటూ ప్రకృతి ఒడిలో వర్కౌట్స్ చేస్తున్న వీడియో ను రాశీఖన్నా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: