సాయితేజ్ కొత్త సినిమా ‘రిప‌బ్లిక్’ మోషన్ పోస్టర్ రిలీజ్

Sai Dharam Tej's Next Movie Republic Motion Poster Is Out Now,Sai Dharam Tej’s Next Titled Republic Motion Poster Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Sai Dharam Tej,Republic,Republic Movie,Republic Telugu Movie,Republic Movie Updates,Republic Telugu Movie Latest News,Republic Movie Motion Poster

‘చిత్రల‌హ‌రి’, ‘ప్ర‌తిరోజూ పండ‌గే’ సినిమాల తర్వాత సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సాయి తేజ్ ప్రస్తుతం దేవ కట్టా తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు. రేపు రిపబ్లిక్ డే కావడంతో ఆసంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాకు ‘రిప‌బ్లిక్‌’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మోషన్ పోస్టర్ లో ప్ర‌జ‌లు ఎన్నుకున్న రాజకీయ నాయ‌కులు, శాస‌నాల‌ను అమ‌లు చేసే ప్ర‌భుత్వ ఉద్యోగులు, న్యాయాన్ని కాపాడే కోర్టు..ఈ మూడు గుర్రాలు ఒక‌రి త‌ప్పులు ఒక‌రు దిద్దుకుంటూ క్ర‌మ‌బ‌ద్దంగా సాగిన‌పుడే అది ప్ర‌జాస్వామ్యం అవుతుంది. ప్ర‌భుత్వం అవుతుంది. అదే అస‌లైన రిప‌బ్లిక్ అంటూ సాయిధ‌ర‌మ్ వాయిస్ ఓవ‌ర్ తో వస్తున్న మాటలు సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నాయి.

కాగా జెబిఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ‌, సుబ్బ‌రాజు, రాహుల్ రామ‌కృష్ణ‌ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + eighteen =