మొత్తానికి మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు సర్కారు వారి పాట చిత్రయూనిట్. కరోనా వల్ల కొన్ని నెలలుగా షూటింగ్ లు మొత్తం ఆగిపోయాయి. ఎలాగొలా గత కొద్దికాలంగా షూటింగ్ లు మొదలవుతున్నాయి. అందరు హీరోలు సినిమా షూటింగ్ లు మొదలు పెట్టడంతో తమ హీరో ఎప్పుడు మొదలు పెడతాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. ఇప్పటికే చిత్రయూనిట్ దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఈ రోజునుండి ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టారు. దుబాయ్‌లో ఈ మూవీ షూటింగ్ అధికారికంగా మొదలైందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘ది ఆక్షన్ అండ్ ది యాక్షన్ బిగిన్స్’ అనే క్యాప్షన్‌తో ట్వీటర్లో ఓ వీడియోను షేర్ చేయగా ఇది చూసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు. అక్కడ ఒక మూడు వారాల షూటింగ్ జరుపుకున్న తర్వాత తిరిగి ఈ మూవీ సెకండ్ షడ్యూల్ షూటింగ్‌ను హైదరబాద్‌లో జరుపుకోనున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
The auction and the action begins 🎬 #SarkaruVaariPaataShuru 💥💥
Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @MythriOfficial @GMBents#SarkaruVaariPaata 🔔 pic.twitter.com/Z75sPfWoi9
— 14 Reels Plus (@14ReelsPlus) January 25, 2021
పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రీ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో పొడవాటి జుట్టుతో మెడ పైన ట్యాటూతో మాస్ లుక్ లో కనిపించనున్నాడు మహేష్. మిగిలిన నటీనటులు ఇతర వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: