ఇప్పటికే పలు హార్రర్ సినిమాలతో భయపెట్టిన సినిమా నందిత శ్వేతా మరోసారి భయపెట్టడానికి రెడీ అవుతోంది. బి.చిన్నికృష్ణ దర్శకత్వంలో నందిత శ్వేత ప్రధాన పాత్రలో ‘అక్షర’ అనే థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా. కొన్ని కారణాల వల్ల రిలీజ్ కు బ్రేక్ పడితే.. కరోనా వల్ల మొత్తానికే లాంగ్ గ్యాప్ వచ్చింది. ఇక ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి థియేటర్ లో రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాను ఫిబ్రవరి 26న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. కామెడీ థ్రిల్లర్ తో పాటు సోషల్ మెసేజ్ ను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నాం.. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కోవిడ్ కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది.ఓటీటీ లో రిలీజ్ చేసేందుకు ఆఫర్లు వచ్చాయి కానీ ఈ సినిమాను థియేటర్లలోనే ఎక్స్ పీరియన్స్ చేయాలని ఇప్పటివరకు వెయిట్ చేశాం. ఇప్పుడు ఆ టైం వచ్చింది.. సినిమా మంచి విజయం దక్కించుకుంటుందన్న నమ్మకం ఉందని తెలిపారు.
Interesting Thriller #𝗔𝗸𝘀𝗵𝗮𝗿𝗮 all set to Release in Theatres on February 26th#AksharaMovie #AksharaFromFeb26 💥
@Nanditasweta @BChinniikrishna @sureshvarmaz @ahiteja @Gauri_Naidu #SureshBobbili @Cinemaahall @GskMedia_PR @MangoMusicLabel pic.twitter.com/HMOWnWV1NM— Telugu FilmNagar (@telugufilmnagar) January 24, 2021
కాగా చిన్ని కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హాల్ బ్యానర్ పై అహితేజ బెల్లంకొండ, సురేష్ వర్మ లు కలిసి నిర్మిస్తున్నారు. ఇంకా ఈసినిమాలో షకలక శంకర్, సత్య, మధునందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. ఈసినిమాలో నందిత శ్వేతన్ కాలేజ్ లెక్చరర్ గా నటిస్తుంది. మరి ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ప్రేమ కథా చిత్రమ్’, ‘అభినేత్రి’ 2 లాంటి హార్రర్ సినిమాలో దెయ్యంగా కనిపించి అందరినీ భయపెట్టిన నందిత శ్వేత ఈ సినిమాలో ఎలా భయపెడుతుందో చూద్దాం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)