పవన్ తో కలిసి మీసం తిప్పుతున్న రానా

Pawan Kalyan and Rana Daggubati To Share The Screen Space Together,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pawan Kalyan and Rana Daggubati,Pawan Kalyan,Actor Pawan Kalyan,Hero Pawan Kalyan,Powerstar Pawan Kalyan,Rana Daggubati,Actor Rana Daggubati,Hero Rana Daggubati,Pawan Kalyan and Rana Daggubati Screen Space Together,Pawan Kalyan and Rana Daggubati Movie,Pawan Kalyan and Rana Daggubati New Movie,Rana Daggubati And Pawan Kalyan Film,Rana Daggubati Starter Shooting With Pawan Kalyan

సాగర్‌ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో మలయాళంలో సూపర్‌ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్‌ కోశియనుమ్‌’ సినిమా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో టాలెంటెడ్ హీరో రానా నటిస్తున్న సంగతి కూడా విదితమే. బిజు మీనన్‌ పాత్రను తెలుగులో పవన్ కల్యాణ్‌ చేస్తుండగా.. రానా పృథ్వీరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీని త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.ఇక తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టారు. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది. అక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్ లో దాదాపు నెల రోజుల పాటు షూటింగ్ చేయనున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ మూవీ నుండి బ్లూ సపారీలో మీసం తిప్పుతున్న రానా లుక్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాలో హీరోయిన్స్ గా సాయి పల్లవి తో పాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.కాగా పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు.

ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసాడు పవన్ కళ్యాణ్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బాలీవుడ్ మూవీ పింక్ కు రీమేక్ గా తెరకెక్కుతుంది. దిల్ రాజు- బోనికపూర్ సంయుక్తంగా ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమ్మర్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.అలాగే రానా నటిస్తున్న ‘విరాట‌ప‌ర్వం’ ఏప్రిల్ 30న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + four =