ఎస్ దర్శన్ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ ‘నో పార్కింగ్’ అనేది ట్యాగ్ లైన్. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా గత ఏడాదే రిలీజ్ కావాలి కానీ కరోనా వల్ల చాలా లేట్ అయిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ టీజర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశాడు. సుశాంత్‌కు, చిత్రబృందానికి నా శుభాకాంక్షలు అంటూ సినిమా టీజర్‌ను ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఇక టీజర్ ను బట్టి బైక్ పార్కింగ్ నేపథ్యంలో సినిమా కొనసాగుతుందని అర్ధమవుతుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనం కొనుగోలు చేయడం.. దానిపై హీరోయిన్‌ను ఎక్కించుకోవడం.. నో పార్కింగ్ స్థలంలో బండి నిలపడం ప్రధాన కథగా ఉండనుందని టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది.
#IVNRteaser is here!!
Hope U like it!😀🙏
Thank you so much for launching it #Prabhas anna! 🤗❤️https://t.co/KUkQU5lyUi@AIStudiosOffl @ShaastraMovies @iamHarishCK @darshn2012 @Meenachau6 @mynnasukumar @Plakkaraju @vennelakishore @priyadarshi_i @UrsVamsiShekar @Ticket_Factory— Sushanth A (@iamSushanthA) January 29, 2021
కాగా ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం, నిఖిల్, కైలాస, కృష్ణచైతన్య తదితరలు నటిస్తున్నారు. A1స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: