కె.జి.యఫ్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్

KGF Chapter 2 Movie Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Yash,Rocking Star Yash,Hero Yash,Actor Yash,KGF: Chapter 2,KGF Chapter 2,KGF Chapter 2 Movie,KGF Chapter 2 Film,KGF Chapter 2 Telugu Movie,KGF Chapter 2 Movie Release Date,KGF 2,KGF Chapter 2 On July 16th,Sanjay Dutt,Homable Films,KGF Chapter 2 Theatricial Release On July 16th,KGF Chapter 2 Release Date Out,KGF Chapter 2 Release Date Confirmed,Yash KGF Chapter 2 Release Date Announced,KGF Chapter 2 Release Date Fix,Yash KGF Chapter 2 Release Date,#KGFChapter2

సినీ లవర్స్ కు పండగే పండగ. గత ఏడాది థియేటర్స్ లేకపోవడంతో సినిమాలను చూసే అవకాశం లేకుండా పోయింది. ఇక ఈ ఏడాది మాత్రం థియేటర్లలో వరుస సినిమాలతో సందడి నెలకొననుంది. గత వారం రోజులుగా వరుసపెట్టి సినిమా రిలీజ్ ల అప్ డేట్ లు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది రిలీజ్ అవ్వాల్సిన పెండింగ్ లో ఉన్న సినిమాలతో పాటు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమాల రిలీజ్ డేట్ లు కూడా వచ్చేసాయి. ఆర్ఆర్ఆర్, ఆచార్య, సర్కారు వారి పాట లాంటి పెద్ద పెద్ద సినిమాల రిలీజ్ డేట్ లు కూడా ప్రకటించేసారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్న కె.జి.యఫ్ 2 సినిమా రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. చెప్పినట్టుగానే ప్రామిస్ ను నిలబెట్టుకుంటున్నాం అంటూ రిలీజ్ డేట్ ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా జులై 16న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. మరి కె.జి.యఫ్ సంచలన విజయంతో కె.జి.యఫ్ 2 పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఆ అంచనాలను ఈ సినిమా రీచ్ అవుతుందో లేదో చూద్దాం.

కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై  నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఇక యష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మిలియన్ వ్యూస్ తో ఇప్పటికే టీజర్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. మరి సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =