F3 మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

F3 Movie Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,F3 Release Date Locked,F3 Movie Release Date Confirmed,Director Anil Ravipudi,Venkatesh,Varun Tej,Tamannaah,Mehreen,Hero Varun Tej,Venkatesh Daggubati,F3,F3 To Be Released On August 27,F3 On Aug 27th,F3,F3 Movie,F3 Film,F3 Telugu Movie,F3 Movie Latest Updates,F3 Movie Release Date,F3 Release Date,F3 Movie Release Date Fix,F3 Movie Release Date Announced,F3 Movie Release Date Out,F3 Movie Release Date Update

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్2’. ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఎఫ్2’లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో అనిల్ రావిపూడి ఏ రేంజ్‌లో నవ్వులు పూయించాడో తెలిసిందే. ఇక ఈ సినిమా సీక్వెల్ ను కూడా అనిల్ రావిపూడి లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లడమే లేట్. వెంకటేష్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఈ సినిమాలో మూడో హీరో కూడా ఉన్నట్టు ఎప్పటినుండో వార్తలు వచ్చాయి . కానీ మూడో స్టార్ హీరోగా ఎవరూ చేయడం లేదని, అసలు మూడో హీరో అన్న ఆలోచన కూడా తనకు లేదని అనిల్ ఇటీవలే తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా F3 నుండి “ఫన్ విల్ బి ట్రిపిల్ల్డ్” అనే క్యాప్షన్ తో ఒక అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ ఏడాది ఆగస్టు 27న సినిమా విడుదల చేస్తున్నట్టు తెలిపారు . చూద్దాం మరి ఈసారి ఏ రేంజ్ లో నవ్వించడానికి వస్తున్నారో.కాగా దిల్‌రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక F2 లో నటించిన తమన్నా, మెహ్రిన్ లే ఈ సినిమాలో కూడా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =