‘ఖిలాడి’ లో యాక్షన్ కింగ్ ‘అర్జున్’

Khiladi Movie Team Welcomes Action King Arjun Onboard,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Arjun Sarja,Actor Arjun Sarja,Ravi Teja,Actor Ravi Teja,Hero Ravi Teja,Khiladi,Khiladi Movie,Khiladi Film,Khiladi Telugu Movie,Khiladi Movie Telugu,Khiladi Movie News,Khiladi Movie Updates,Arjun Sarja Joins Khiladi Cast,Arjun Sarja Joins Khiladi Movie Cast,Khiladi Cast,Arjun Sarja In Khiladi,Arjun Sarja In Ravi Teja Khiladi,Khiladi Latest Update,Arjun Sarja Latest News,Action King Arjun In Khiladi

రమేష్‌వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేయగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయగా మరోసారి హుషారైన పాత్రలో రవితేజ నటిస్తున్నట్టు కనిపిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో మరో సీనియర్ హీరో కూడా జాయిన్ అయ్యాడు. ఆయన ఎవరో కాదు యాక్షన్ కింగ్ అర్జున్. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన అర్జున్ చాలా కాలం తెలుగులో కనిపించలేదు. ఈ మధ్యనే ఒకటి రెండు సినిమాల్లో కనిపించారు. నితిన్ ‘లై’ మూవీలో విలన్ పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా చేసాడు. ఇందులో అల్లు అర్జున్ తండ్రి పాత్రలో నటించాడు.

ఇక మళ్ళీ ఖిలాడి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తో పాటు ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘2021లో కొత్త సినిమా.. ‘ఖిలాడి’ సెట్స్‌లో నేను’ అని క్యాప్షన్ పెట్టి ఆయన స్టైలిష్ లుక్‌ను పోస్ట్ చేశారు అర్జున్.

కాగా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతీలాల్‌ గద సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా.. ‘లూసిఫ‌ర్’ ఫేమ్ సుజిత్‌ వాసుదేవ్ సినిమాటోగ్రాఫీ అందిస్తున్నాడు. వేస‌విలో చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =