‘కార్తికేయ 2’ రెడీ టూ షూట్

Karthikeya 2 Team Gets Ready For Movie Shooting,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Nikhil,Nikhil Siddharth,Actor Nikhil,Hero Nikhil,Karthikeya,Karthikeya 2,Karthikeya 2 Movie,Karthikeya 2 Film,Karthikeya 2 Telugu Movie,Karthikeya 2 Movie Telugu,Karthikeya 2 To Start Rolling,Karthikeya 2 Movie Shooting,Nikhil Siddharth Karthikeya 2,Karthikeya 2 Movie To Start Rolling,Karthikeya 2 Movie Update,Director Chandoo Mondeti,Nikhil Siddharth New Movie,Nikhil Siddharth Karthikeya 2 Movie News,Karthikeya 2 Movie Latest News,Karthikeya 2 Movie Shooting

నిఖిల్‌, చందు మెుండేటి కాంబినేష‌న్ లో వచ్చిన ‘కార్తికేయ’ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు కార్తికేయ 2 సినిమా చేయడానికి రెడీ అయ్యారు. అయితే నిజానికి గత ఏడాది ఉగాది నుండే షూటింగ్ మొదలవ్వాలి కానీ కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ అయింది. ఇక ఇప్పుడు అన్ని సినిమాల షూటింగ్ లు మొదలవుతుండటంతో ఈ సినిమాను కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మేరకు డైరెక్టర్ చందూ కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు.. త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ నెలలో లేదా వచ్చే నెలలో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. మరి ఇందులో క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి అంతేకాదు నిఖిల్ డాక్టర్ పోస్టర్ ను కూడా రెలీజ్ చేశారు. ఒక కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ద్వాపర యుగానికి సంబంధించిన ఒక రహస్యం.. ఈ యుగంలో దానిని తెలుసుకోవడానికి సాగించే అన్వేషణగా ఈ కథ నడవనుందని ఆ టీజర్ లో తెలిపారు. మరి నిఖిల్ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా వస్తుండటంతో ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. చూద్దాం కార్తికేయ2 ఎంత వరకూ సక్సెస్ అవుతుందో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 13 =