ఏఎన్నార్ దత్త పుత్రుడు – హ్యాపీ బర్త్ డే సుమంత్

Akkineni New Generation Hero Sumanth Celebrates His Birthday Today,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Hero Sumanth,Sumanth,Actor Sumanth,Hero Sumanth Birthday Special,Sumanth Movies,Actor Sumanth Movies,Sumanth Latest Movie,Sumanth Latest News,Sumanth Hit Movies,Sumanth Movies,Sumanth Full Movies,Sumanth About Akkineni Family,Sumanth Best Movies,Sumanth Birthday,Happy Birthday Sumanth,Hero Sumanth Special,Sumanth Birthday Special,Nagarjuna,Nageswara Rao,Godavari,Satyam,Sumanth Birthday News,Sumanth Celebrates His Birthday Today,#HBDSumanth,#HappyBirthdaySumanth

ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది కామన్. కానీ వారి సినీ కెరీర్ మాత్రం తమలోని నటన.. సినిమాలను ఎంచుకునే విధానం పై ఆధారపడి ఉంటుంది. ఇక తాత ఏయన్నార్ సినీ చరిత్రలోనే ఒక దిగ్గజం.. మామ నాగార్జున అగ్ర హీరో.. వారి ఆశీస్సులతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదటి వారసత్వ హీరో సుమంత్. తాత పోలికలు పుష్కలంగా పునికిపుచ్చుకున్న మనవడు సుమంత్. అంతేకాదు మొదటి వారసుడు కావడంతో సుమంత్ అంటే ఏయన్నార్ కి అమితమైన ప్రేమ. అప్పట్లో వరుస సినిమాలతో బిజీగా వుండే ఏఎన్నార్ కు ఒక సినిమా షూటింగ్ టైం లో హార్ట్ ఎటాక్ రావడంతో హార్ట్ సర్జరీ చేసారు. సర్జరీ జరినప్పుడు ఇంట్లోనే ఏడాది పాటు ఉండాల్సి వచ్చిందట. ఆ సమయంలోనే సుమంత్‌ జన్మించాడు. దానితో అక్కినేని ఎక్కువ సమయం సుమంత్ తోనే గడిపేవారట. అలా సుమంత్ పై మమకారంతో తనదగ్గరే ఉంచుకోవాలని ఏయన్నార్ దత్తత కూడా తీసుకొని తన దగ్గరే వుంచుకున్నారట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సుమంత్ స్కూలింగ్ మొత్తం హైద్రాబాద్ లోనే జరిగింది. హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువు పూర్తి చేసిన సుమంత్ ఆ తర్వాత ఉన్నత చదువులు కోసం విదేశాలకు వెళ్ళాడు. ఇప్పుడున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ సుమంత్ ఇద్దరూ క్లాస్ మేట్స్ అండ్ ఫ్రెండ్స్ కూడాను. మిచిగాన్ లో ఇంజినీరింగ్ కోర్సు మొదలుపెట్టిన సుమంత్.. తన ఆసక్తి సినిమాలపై ఉందని గ్రహించి.. ఆ తర్వాత అది మధ్యలోనే ఆపేసి చికాగోలోని కొలంబియా కాలేజ్ లో ఫిలిం స్టడీస్ లో బీఏ చేసాడు.

ఆ తర్వాత 1999 రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమకథ’ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా మ్యూజికల్ గా హిట్ అయింది కానీ సినిమా మాత్రం ప్లాప్ అయింది. అయితే సుమంత్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక రెండో సినిమా యువకుడు తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత పలు సినిమాలు చేసినా.. మేనమామ నాగార్జున నిర్మించిన ‘సత్యం’తో మాత్రం కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తొలి సక్సెస్ చూసిన సుమంత్ ఆ తరువాత ఆచితూచి సినిమాలు ఎంచుకుంటూ వెళ్ళాడు. ముందుకుసాగుతున్నారు.. ‘సత్యం’ తరువాత “గౌరీ, మహానంది,” వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు సుమంత్. ఆ సినిమాలు మంచి పేరే తెచ్చిపెట్టినా ‘సత్యం’ లాంటి సూపర్ హిట్స్ మళ్ళీ సుమంత్ దరి చేరలేదు.

2004 లో తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి ని వివాహం చేసుకున్నాడు. అయితే ఆ వివాహ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోవాల్సి వచ్చింది. అయితే డైవర్స్ తీసుకున్న తర్వాత కూడా వీళ్లిద్దరు మంచి ఫ్రెండ్ షిప్ ను అయితే కొనసాగిస్తూనే ఉన్నారు.

చాలా గ్యాప్ తర్వాత 2006 లో గోదావరి తో మళ్లీ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మరికొన్ని ప్లాప్స్ అయినా సుమంత్ ను అవకాశాలు పలకరిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పోటీని తట్టుకొని.. జయాపజయాలను పక్కన పెట్టి వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. మళ్లీరావా సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సుమంత్ ఆ తర్వాత రొటీన్ కథలు కాకుండా ఇదం జగత్, సుబ్రహ్మణ్యపురం వంటి విభిన్నమైన సినిమాలు చేసాడు. ఆ సినిమాలు కూడా మంచి టాక్ నే సొంతం చేసుకున్నాయి. తాత పోలికలు ఉండడంతో ఆ మధ్య యన్టీఆర్ బయోపిక్ లో ఏయన్నార్ పాత్ర చేసే అవకాశం దక్కించుకున్నాడు. ప్రస్తుతం మరో రెండు డిఫరెంట్ స్టోరీస్ తో వస్తున్నాడు. అందులో ఒకటి ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో ‘కపటధారి’ సినిమా. క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ట‌యిన `కవలుదారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది.మరొకటి మ‌ను య‌జ్ఞ డైరెక్ట్ చేస్తున్న’అన‌గ‌న‌గా ఒక రౌడీ’ అనే సినిమా. ఒక్క షెడ్యూల్ మినహా ఈ సినిమా షూటింగ్ కూడా మొత్తం పూర్తి చేసుకుంది. ఇక నేడు సుమంత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఏక్ దో తీన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై గార్ల‌పాటి ర‌మేశ్‌, డాక్ట‌ర్‌ టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. మార్క్ కే రొబిన్ మ్యూజిక్ డైరెక్ట‌ర్.

మరి సుమంత్ మరెన్నో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని.. ముందు ముందు కూడా ఇలానే డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ తో సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.