సుమంత్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో సుమంత్ ‘కపటధారి’ అనే మరో డిఫరెంట్ కథతో వస్తున్న సంగతి తెలిసిందే. కన్నడంలో సూపర్‌హిట్టయిన `కవలుదారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్. అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా న థియేటర్ లో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వస్తున్నాడు. ‘అనగనగా ఒక రౌడీ’ అనే సినిమా తో సినిమాను తెరకెక్కించనున్నారు. నేడు సుమంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఈ లుక్ లో సుమంత్ చాలా డిఫరెంట్ గా వున్నాడు. షార్ట్ హెయిర్‌తో బ్లాక్ లుంగీలో నడుముకు చేతులు పట్టుకుని సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నాడు సుమంత్. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఒక్క షెడ్యూల్ మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్నట్టు సమాచారం.

కాగా మను యజ్ఞ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఏక్ దో తీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గార్లపాటి రమేష్, డాక్టర్ టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. మార్క్ కే రొబిన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలో ఇంకా మధునందన్, ధన్‌రాజ్, కళ్యాణ్ చక్రవర్తి, హైపర్ ఆది, మిర్చి కిరణ్, ప్రభ తదితరులు నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























