‘లైగర్’ క్రేజీ అప్ డేట్

Liger Team To Announce Movie Release Date Tomorrow

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న సినిమా ‘లైగర్’. లాక్ డౌన్ ముందే ఈ సినిమా షూటింగ్ ముంబై లో కొద్దిరోజులు జరుపుకుంది. మళ్లీ ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఇక తాజాగా ఈ సినిమా నుండి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఇప్పటికే చాలా సినిమాల రిలీజ్ డేట్స్ ను ప్రకటించగా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. అందుకు ముహూర్తం కూడా ఖరారు చేశారు రేపు ఉదయం 8 గంటల 14 నిమిషాలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నట్టు అధికారికంగా తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరి పూరీ డైరెక్షన్ గురించి తెలిసిందే కదా.. సినిమాను చాలా తొందరగా పూర్తి చేసే డైరెక్టర్స్ లో పూరీ ప్లేస్ ఎప్పుడూ ఫస్టే ఉంటుంది. చాలా తొందరగా సినిమాను కంప్లీట్ చేస్తాడు. మరి ఈ సినిమా కూడా ఎక్కువ టైం తీసుకోకుండానే తొందరగానే ఫినిష్ చేస్తాడు.. రిలీజ్ చేస్తాడు… మరి చూద్దాం రిలీజ్ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేశారో..

 

View this post on Instagram

 

A post shared by Puri Connects (@puriconnects)

కాగా బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించనున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. మరి ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో… పూరీ విజయ్ ను ఎలా చూపిస్తాడో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − one =