డిఫరెంట్ కథలను చేయడంలో నాని ఎప్పుడూ ముందుంటాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి ‘టక్ జగదీష్’. ‘నిన్నుకోరి` వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. అంతేకాదు చాలా కాలం తర్వాత మళ్లీ మాస్ అండ్ కమర్షియల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్నాడు నాని. ఇప్పటికే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఫుల్ మాస్ లుక్ లో ఉన్న నాని స్టిల్ అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 23 న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా నుండి తాజాగా ఒక అప్ డేట్ ఇచ్చారు చిత్రబృందం. ఇంకోసారి ఇంకోసారి అనే ఫస్ట్ సింగిల్‌ను ఫిబ్రవరి 13న ఉదయం తొమ్మిది గంటలకు విడుదల చేస్తామని ప్రకటిస్తూ నాని రీతూవర్మ ఫొటో ను కూడా పోస్ట్ చేశారు. నాని-రీతూ కనిపిస్తున్న స్టిల్ అందరినీ ఆకట్టుకుంటోంది.
13 ki vindhaam
14th ki repeatseyyyFirst single of tuck will be out on 13th Feb morning 9AM #InkosaariInkosaari
A @MusicThaman Musical .. Our first album 🤗
Tuck and Play 🤍@ShivaNirvana @riturv @aishu_dil @Shine_Screens @adityamusic pic.twitter.com/O0lXGe76VV
— Nani (@NameisNani) February 10, 2021
కాగా రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇంకా సినిమాలో జగపతి బాబు, రావు రమేష్, నరేష్, నాజర్, దేవదర్శిని, రోహిణి, మాల పార్వతి, డేనియల్ బాలాజి,తిరువీర్, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటో గ్రఫీ ప్రసాద్ మూరెళ్ల అందిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























