ఒక్క సినిమాతోనే ప్రేమలో పడ్డారు.. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.. టాలీవుడ్ లోనే బెస్ట్ కపుల్స్ లిస్ట్ లో ముందు ఉంటారు..ఆ జంట ఎవరో ఇప్పటికే ఐడియా వచ్చి ఉంటది.. ఇంకెవరూ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్. 2000వ సంవత్సరంలో వచ్చిన వంశీ సినిమాలో మహేష్, నమ్రత కలిసి నటించారు. ఆ సినిమాతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి 2005 లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహబంధానికి నేటితో 16 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సోషల్
మీడియా ద్వారా ఒకరికొకరు స్వీట్ గా విషెస్ చెప్పుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహేష్ వారిద్దరి ఫొటో ను పోస్ట్ చేస్తూ అందులో.. నా హ్యాపీ ప్రేమకు 16ఏళ్ళు.. ఎప్పటికీ నీతోనే అని పోస్ట్ లో పేర్కొన్నాడు. ఇక నమ్రత కూడా 16 ఏళ్ళు చాలా తొందరగా గడిచిపోయాయి.. ప్రేమ, నమ్మకం, విశ్వాసం కలయికతో మన వివాహ బంధం ఏర్పడింది.. పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేసింది.
View this post on Instagram
View this post on Instagram
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుగుతుంది. ఇక మహేష్ ఫ్యామిలీ కూడా అక్కడే ఉండటంతో ఒకపక్క షూటింగ్ చేస్తూనే మరో పక్క ఫ్యామిలీతో ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























