మెట్రో వంటి డిఫరెంట్ సినిమాను తెరకెక్కించిన ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా విజయరాఘవన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో ‘కోడియిల్ ఒరువన్’ గా రూపొందుతున్న ఈ సినిమాను తెలుగులో ‘విజయ రాఘవన్’గా విడుదల చేస్తున్నారు. ఇక కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సినిమా టీజర్ ను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఇలా ఐదు భాషల్లో ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా తాజాగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలిపింది. కాగా ఆత్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్ సమర్పణలో చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్.సంజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
.@Vijayantony’s #KodiyilOruvan #VijayaRaghavan shoot wrapped up. All set for APRIL release🔥
Directed by – @akananda@im_aathmika @nsuthay @nivaskprasanna @chendurfilm @FvInfiniti @saregamasouth @RIAZtheboss @vamsikaka @bhashyasree @CtcMediaboy . Great job by Anand & Team👍👍 pic.twitter.com/Z19NeTv3zq
— Dr. Dhananjayan BOFTA (@Dhananjayang) February 8, 2021
విభిన్నమైన సినిమాలు చేయడంలో విజయ్ ఆంటోనీ ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ ఆంటోని. ‘తమిళరసన్’, ‘అగ్ని సిరగుగళ్’చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అంతేకాదు మరోసారి బిచ్చగాడు 2 తో రావడానికి సిద్దమయ్యాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: