విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ ‘నాంది’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 19న విడుదల చేయనున్నట్టు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఇక ఇప్పటికే ఈ రిలీజ్ చేసిన టీజర్ కు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక రిలీజ్
కూడా తొందర్లోనే ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేశారు. న్యాచురల్ స్టార్ నాని చేతుల మీద చెలి అనే మొదటి పాటను రిలీజ్ చేశారు. ఇక మంచి మెలోడియస్ గా ఉన్న ఈ పాట అందర్నీ బాగా ఆకట్టుకుంటుంది.
Here’s the soothing melody from intriguing #Naandhi
Really looking forward to this one babai @allarinaresh 🤗https://t.co/dp25mubv88@allarinaresh @varusarath5 @vijaykkrishna @SatishVegesna@SV2Ent @ChotaKPrasad @RajeshDanda_ @laharimusic @SriCharanPakala— Nani (@NameisNani) February 10, 2021
ఇంకా ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న అల్లరి నరేష్ నాంది అనే చిత్రంతో ఎలా అయిన హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. మరి చూద్దాం ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: