సత్య దేవ్ ‘క్యూట్ ఫ్యామిలీ’

Actor Satyadev Shares An Adorable Picture Of His Cute Family On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actor Satyadev,Satyadev,Hero Satyadev,Actor Satyadev Shares An Adorable Picture,Satyadev Shares Picture Of His Cute Family,Satyadev Family,Satyadev On Instagram,Actor Satyadev Cute Family,Actor Satyadev Family Pic,Hero Satyadev Latest News,Hero Satyadev Family Pic,Hero Satyadev Latest Photo Gallery,Hero Satyadev Family,Actor Satyadev Shares Picture Of His Family On Instagram,Actor Satyadev Latest Film Updates

‌‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సత్యదేవ్‌… ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న ఫ్రెండ్ పాత్రలే చేసాడు. ఇక పూరీ జగన్నాథ్‌ ‘జ్యోతి లక్ష్మీ’తో హీరోగా పరిచయం అయినా హీరో కు మాత్రం ఫిక్స్ కాకుండా వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, హీరోగా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఉన్న టాలెంటెడ్ నటుల్లో సత్యదేవ్ పేరు కూడా చేరిపోయింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ గా వున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సత్య దేవ్ కు పెళ్లైన సంగతి తెలిసిందే కదా. అయితే ఫ్యామిలీని పెద్దగా ఎక్స్పోజ్ చేసే వ్యక్తి కాకపోవడంతో ఇన్ని రోజులు పెద్దగా తెలియదు. ఇక తాజాగా తనఫ్యామిలీ ఫొటోను ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది అందరికీ తెగ నచ్చేస్తుంది. సత్యదేవ్ కుమారుడు సావర్నిక్ మొద‌టి పుట్టిన‌రోజు సందర్భంగా.. నా జూనియ‌ర్ ఫ‌స్ట్ బ‌ర్త్ డే అంటూ..భార్య దీపిక‌, సావ‌ర్నిక్‌తో క‌లిసి దిగిన ఫొటో ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్నాడు. ఇక ఈ ఫొటోకు క్యూట్ ఫ్యామిలీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Satyadev (@actorsatyadev)

ప్రస్తుతం సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. గుర్తుందా శీతాకాలం టైటిల్ తో ఈ సినిమా రీమేక్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఈ సినిమాకు నాగ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీనితో పాటు నూతన దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తిమ్మరుసు అనే సినిమాను చేయనున్నాడు. వీటితోపాటు ‘బ్లఫ్‌ మాస్టర్‌’ డైరెక్టర్ గోపీ గణేష్‌ తో మరోసారి సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు ‘గాడ్సే’ అని టైటిల్‌ ఫిక్స్‌ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =