చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న సినిమా చెక్. చాలా డిఫరెంట్ కథతో వస్తున్నాడు నితిన్. ఇప్పటికే ఈ సినిమా టీజర్ కు ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమాతో మరో హిట్ ను కూడా తన ఖాతాలో వేసుకునేలా ఉన్నాడన్న అభిప్రాయానికి వస్తున్నారు అందరూ . ఇక ఈ ఎఫెక్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ పై కూడా పడింది. టీజర్ కు ట్రైలర్ కు మంచి టాక్ వచ్చి సినిమాపై అంచనాలు పెరిగితే ఆ సినిమా హక్కులు కూడా అదే రేంజ్ లో అమ్ముడుపోతాయన్న విషయం తెలిసిందే కదా. ఇప్పుడు చెక్ విషయంలో కూడా అదే జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చెక్ నైజం హక్కులను శ్రీ కార్తికేయ సినిమాస్ అనే సంస్థ సొంతం చేసుకుంది. ఇక ఈ విషయాన్ని తమ అధికారిక ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ చెక్ సినిమా హక్కులను సొంతం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
Happy to announce that we have acquired Nizam Distribution Rights for Youth Star @actor_nithiin‘s Much Awaited Movie, #Check
Grand Release On Feb 26th 🔥 @Rakulpreet @BhavyaCreations @Sriniva20205292 #CheckOnFeb26th pic.twitter.com/muvByWmYwO
— Sri Karthikeya Cinemas (@Karthikeyagroup) February 6, 2021
కాగా భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా సిమ్రన్ చౌదరి, పోసాని కృష్ణమురళి, సాయిచంద్, మురళీ శర్మ, హర్ష వర్ధన్, సంపత్ రాజ్, చైతన్య కృష్ణ, కార్తీక్ రత్నం కీలక పాత్రల్లో నటించారు. కల్యాణిమాలిక్ ఈ సినిమాకు సంగీతం అందించగా..సినిమాటోగ్రఫీ రాహుల్ శ్రీవాత్సవ్ అందించాడు. ఫిబ్రవరి 26న ఈ సినిమా విడుదల కానుంది. మరి మరణ శిక్ష పడిన ఖైదీ తన చదరంగం నైపుణ్యంతో బయటకు రావడానికి ఎలా ప్రయత్నిస్తాడు అన్నది కథ. చూద్దాం నితిన్ ఆ అంచనాలను రీచ్ అవుతాడో..లేదో..?
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































