‘సీటీమార్’ లో ‘క్రాక్’ భామ

Apsara Rani To Feature In A Special Song In Gopichand Seetimaarr Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Apsara Rani,Apsara Rani New Movie,Apsara Rani Upcoming Movie,Apsara Rani Next Movie,Apsara Rani In Seetimaarr,Seetimaarr,Seetimaarr Movie,Seetimaarr Telugu Movie,Seetimaarr Movie Telugu,Seetimaarr Movie Update,Gopichand Seetimaarr,Actor Gopichand,Tamannaah Bhatia,Gopichand,Sampath Nandi,Seetimaarr Special Song,Apsara Rani Special Song In Seetimaarr,Apsara Rani Special Song In Seetimaarr Movie,Apsara Rani Special Song In Gopichnad’s Upcoming Film Seetimaarr,Apsara Rani Special Song,Apsara Rani Item Song In Gopichand Seetimaarr,Apsara Rani To Feature In A Special Song In Seetimaarr,Apsara Rani Special Song In Gopichand Seetimaarr

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘థ్రిల్లర్’ సినిమాలో నటించి ఆ సినిమాతోమంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది అప్సర రాణి. ఆ సినిమా ఫలితం సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది. ఇప్పటికే రవితేజ ‘క్రాక్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి అలరించిన అప్సర రాణి ఇప్పుడు మరో సినిమాలో స్పెషల్ సాంగ్ కు సెలెక్ట్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో గోపీచంద్ సంపత్ నంది కాంబినేషన్‌లో ‘సీటీమార్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేయనుంది. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ సంపత్ నంది తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ”పటాకా రాణి అప్సర రాణికి వెల్‌కమ్.. సీటీమార్ సినిమాలో ఈమెతో చేయబోయే ఐటెం సాంగ్ అందరికీ లైఫ్ లాంగ్ గుర్తుంటుందని నమ్మకంగా చెబుతున్నా” అని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు.

కాగా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా మరో కీలక పాత్రలో నటిస్తుంది. తెలంగాణ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా న‌టిస్తుంది. మ‌రో హీరోయిన్ దిగంగ‌న న‌టిస్తుండ‌గా పోసాని కృష్ణ ముర‌ళి, రావు ర‌మేష్‌, భూమిక‌, రెహ‌మాన్, బాలివుడ్ యాక్ట‌ర్ త‌రుణ్ అరోరా కూడా న‌టిస్తున్నారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నాడు. సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసి ఏప్రిల్‌ 2న ప్రపంచ‌ వ్యాప్తంగా విడుద‌ల‌ చేయనున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =