వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నవరుణ్ తేజ్ ప్రస్తుతం కొర్రపాటి దర్శకత్వంలో గని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది.ఇటీవలే వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను టైటిల్ ను రిలీజ్ చేశారు. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ గా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ షెడ్యూల్‌లో వరుణ్ తేజ్, ఉపేంద్రలపై పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారట. వీరిద్దరి మధ్య ఓ ఫైట్ సీన్ కూడా ఉంటుందని తెలుస్తోంది.
కాగా తాజాగా వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ద్వారా తన వర్క్ స్టేషన్ కు సంబంధించిన ఫొటో ఒకటి పోస్ట్ చేసాడు. దానికి వర్క్ స్టేషన్.. కొన్ని రోజులు ఇంకా ఇక్కడే అని ట్వీట్ లో పేర్కొన్నాడు.
Work station for the next few months!#Ghani 🥊 pic.twitter.com/Wo2n4FcgjW
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) February 19, 2021
యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుంది. ఇంకా సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్రల లాంటి స్టార్లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు… హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.




Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.