టాలీవుడ్ లో ఉన్న ఎంతో మంది హీరోల్లో అసలు ఏమాత్రం బ్రేక్ లేకుండా ఒక సినిమా తర్వాత మరొక సినిమా చేస్తూ వెళ్లే హీరో ఎవరైనా వున్నారంటే అందులో న్యాచురల్ స్టార్ నాని పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. గత ఏడాది ‘వి’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన నాని ఈ ఏడాది మరో రెండు సినిమాలతో వచ్చేస్తున్నాడు.
ప్రస్తుతం నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో టక్ జగదీష్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే నాని తన ట్విట్టర్ ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే కదా. అయితే తాజాగా ఈ సినిమానుండి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ టీజర్ రిలీజ్ టైం ప్రకటించారు. రేపు నాని పుట్టినరోజు సందర్భంగా టక్ జగదీష్ టీజర్ ను సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. మోషన్ పోస్టర్ టక్ జగదీష్ చిత్రంపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తుంది.
ఇక ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న థమన్ కూడా తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ డైరెక్టర్ శివ నిర్వాణకు థ్యాంక్స్ చెప్పాడు. నాని ని ఇంతకు ముందెన్నడూ చూడని పాత్రలో చూపిస్తున్నందుకు.. చాలా డీప్ అండ్ ఇంటెన్స్ వుంది పాత్రలో.. ఇంకా అద్భుతమైన విజువల్స్ కు థ్యాంక్స్ అంటూ తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఇక ఇప్పటికే థమన్ అందించిన ‘మరోసారి’ పాటకు మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే.
Thanks to dear @ShivaNirvana for the brilliant Visuals and @NameisNani never before avtarrrr !! 💞❤️ Very deep and intense 🎥 !! FEB 23’rd !! 🖤 pic.twitter.com/7kI79MSWiF
— thaman S (@MusicThaman) February 21, 2021
కాగా రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇంకా సినిమాలో జగపతి బాబు, రావు రమేష్, నరేష్, నాజర్, దేవదర్శిని, రోహిణి, మాల పార్వతి, డేనియల్ బాలాజి,తిరువీర్, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటో గ్రఫీ ప్రసాద్ మూరెళ్ల అందిస్తున్నాడు.




Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.