వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ మేర్లపాక గాంధీ. ఆ తర్వాత వచ్చిన `కృష్ణార్జున యుద్ధం` ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు నితిన్ తో ‘అంధాధున్ రీమేక్’ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా టైటిల్ కూడా ఇంకా ప్రకటించకముందే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. జూన్ 11న చిత్రం విడుదల కానుందని అధికారికంగా తెలియచేసారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
𝗦𝗘𝗘😎 you in cinemas on June 11th#Nithiin30OnJune11th#Nithiin30 #ProdNo6@actor_nithiin @tamannaahspeaks @NabhaNatesh @MerlapakaG
#SudhakarReddy #NikithaReddy @MukhiSree @mahathi_sagar pic.twitter.com/FQIPXTV49m— Sreshth Movies (@SreshthMovies) February 19, 2021
కాగా ఈ సినిమాలో టబు పాత్రలో తమన్నా.. రాధికా ఆప్టే పాత్రలో నభా నటేష్ నటిస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఎన్.సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాగర్ మహతి సంగీతం అందించనుండగా… హరి కె.వేదాంత్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు.
మరోవైపు నితిన్ కూడా మంచి జోరు మీదున్నాడు. ఇప్పటికే అతను నటించిన రెండు చెక్, రంగ్ దే సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్ నటించిన చిత్రం ‘చెక్’. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు గా నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. దీన్ని ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అలాగే, వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ కాగా ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చేసింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: