ఇండస్ట్రీలోకి లేట్ గా ఎంట్రీ ఇచ్చినా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ తో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు దగ్గుబాటి రానా. 2010లో ‘లీడర్’ సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు రానా. మొదటి సినిమా అని ఏదో కమర్షియల్ హంగులకు పోకుండా తన బాడీ లాంగ్వేజ్ కు సరిపడా పాత్రను ఎంచుకొని… లీడర్ సినిమాలో ముఖ్యమంత్రి అర్జున్ ప్రసాద్ పాత్రలో నటించి… మొదటి ప్రయత్నంలోనే నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు. ఇక అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ విభిన్నమైన పాత్రలతో రానా అంటే డిఫరెంట్ గా సినిమాలు చేస్తాడు అన్న పేరును సంపాదించుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక లీడర్ సినిమా రిలీజ్ అయి 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సతీమణి మిహీకా రానాకు విషెస్ తెలియచేసింది. ఇన్‌స్టాగ్రామ్ లో `లీడర్` సినిమా పోస్టర్‌ను పోస్ట్ చేసి.. `హ్యాపీ 11 ఇయర్స్.. మై డార్లింగ్ రానా` అని పేర్కొంది. ఇక, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ కూడా రానాకు ట్విటర్ ద్వారా విషెస్ చెప్పి… రానా జర్నీకి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది.
Wishing @RanaDaggubati the best on finishing 11 years as an actor! Here is a very special video reminiscing his journey so far! ♥️https://t.co/72yL9ekGqV
— Suresh Productions (@SureshProdns) February 19, 2021
కాగా భారతదేశం గర్వించదగ్గ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఎ.వి.ఎం.ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు.
ఇక ప్రస్తుతం ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా తెరకెక్కిన “హాథీ మేరే సాథీ ” సినిమా రిలీజ్ కు సిద్ధంగా వుంది. తెలుగులో ‘అరణ్య’, తమిళ్‌లో కదన్ పేరుతో రిలీజ్ కానుంది. దీనితోపాటు టాలెంటెడ్ హీరో రానా వేణు ఊడుగుల దర్శకత్వంలో `విరాట పర్వం`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: