ఆకాష్ పూరీ ‘చోర్ బజార్’ ప్రారంభం

Aakash Puri Next Movie Chor Bazar Launched Today With Pooja Ceremony,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Aakash Puri,Actor Aakash Puri,Hero Aakash Puri,Chor Bazar,Chor Bazar Movie,Chor Bazar Film,Chor Bazar Telugu Movie,Chor Bazar Movie Telugu,Chor Bazar Movie Update,Chor Bazar Movie Latest News,Aakash Puri Chor Bazar,Aakash Puri Next Movie Chor Bazar,Aakash Puri Next Movie Chor Bazar Launched,Aakash Puri Next Movie Chor Bazar Pooja Ceremony,Aakash Puri New Movie Launch,Aakash Puri Upcoming Movie Launch,Aakash Puri New Movie Chor Bazar,Aakash Puri Chor Bazar Pooja Ceremony,Aakash Puri Next Movie Update,Chor Bazar Movie Pooja Ceremony

బాలనటుడిగా పలు సినిమాల్లో నటించి ఆంధ్రా పోరి, మెహబూబా సినిమాలతో హీరోగా పరిచయమయ్యాడు ఆకాష్ పూరీ. అయితే ఆ సినిమాలు అంతగా విజయాన్ని అందించలేకపోయాయి. ప్రస్తుతం అనిల్ పాడూరిదర్శకత్వంలో ‘రొమాంటిక్’ సినిమాతో రాబోతున్నాడు. ఇక ఇప్పటీకే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ను బట్టి ఈ సినిమా ఎంత రొమాంటిక్ గా వుండబోతుందో తెలుస్తుంది. అయితే ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ ఇంకా రిలీజ్ కు నోచుకోలేదు. ఇక ఈ సినిమాలో ఆకాష్ పూరీ సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తుంది. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ పతాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు.ఇంకా ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తుంది. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం అందిస్తుండ‌గా న‌రేశ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు ఆకాష్ పూరీ. జార్జ్ రెడ్డి చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు జీవన్ రెడ్డితో కలిసి చోర్ బ‌జార్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈరోజు ఈ చిత్రం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. హీరో ఆకాష్ ‌పై ఆయన సోదరి పవిత్ర పూరీ క్లాప్ ఇవ్వగా, తల్లి లావణ్య కెమెరా స్విచ్చాన్ చేశారు.

కాగా లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను వీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో సుబ్బరాజు, పోసాని, లేడీస్ టైలర్ ఫేమ్ అర్చన కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్ర‌వ‌రి 26 నుండి చిత్ర షూటింగ్ మొద‌లు కానుంది. సురేష్ బొబ్బిలి చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − two =