మాస్ మహారాజా రవితేజ స్పీడు పెంచాడు. క్రాక్ సినిమా చేయడానికి చాలా గ్యాప్ తీసుకున్న రవితేజ ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చి.. ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే రవితేజ రమేష్‌వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేయగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి మంచి ఎనర్జిటిక్ పాత్రలో రవితేజ ఫ్యాన్స్ ను అలరించడానికి వచ్చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై జయంతీలాల్ గద సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. వేసవిలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో సినిమాను ఖరారు చేసాడు రవితేజ. రవితేజ నటించనున్న 68వ చిత్రమిది. దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు. ప్రసన్నకుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా… త్వరలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియచేయనున్నారు. రవితేజ నటిస్తున్న ‘ఖిలాడి’ సినిమా షూటింగ్ పూర్తికాగానే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
We are happy to announce that we will be teaming up with Mass Maharaja @RaviTeja_offl & #TrinadhaRaoNakkina for a mass entertainer #RT68 🔥
Story & Screenplay: @KumarBezwada @peoplemediafcy @AAArtsOfficial @vishwaprasadtg @AbhishekOfficl @vivekkuchibotla
More details soon!! pic.twitter.com/rPDUh5oN2s
— People Media Factory (@peoplemediafcy) February 21, 2021
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: