గతంలో పలు దేశభక్తి సినిమాల్లో నటించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మరో సారి అదే జోనర్ తో వచ్చేస్తున్నాడు. రత్నబాబు దర్శకత్వంలో మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్రయూనిట్.. మిగిలిన షూటింగ్ పూర్తి చేసే పనిలో పడింది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
తాజాగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు మంచు విష్ణు. ఈ సినిమాకు ఇళయ రాజా సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇద్దరు లెజెండ్స్ ఉన్న ఈసినిమాను నిర్మించడం దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తున్న అని తెలిపాడు. ఈ నేపథ్యంలో సన్ ఆఫ్ ఇండియా మ్యూజిక్ సిట్టింగ్స్ కు సంబంధించిన వీడియోను మంచు విష్ణు పోస్ట్ చేసాడు. ఇక ఈ వీడియోలో మోహన్ బాబు, ఇళయరాజా మధ్య ఒక ఆసక్తికర సంభాషణ జరిగింది. 11వ శతాబ్ద కాలం నాటి గద్యాన్ని ఇళయరాజాకు వినిపించగా దానికి ఇళయ రాజా ఇంత కఠినంగా ఉంది ఎం చేయాలి అని అడుగగా.. దానికి బాణీలు కట్టాలని మోహన్ బాబు కోరాడు. ఇంత కఠినంగా ఉంది, దీనికి బాణీలు ఎలా కట్టాలి? అని ఇళయరాజా వ్యాఖ్యానించగా, అందుకు మీరే సమర్థులు… మీరు చేయనిదంటూ లేదు అని మోహన్ బాబు కోరాడు.
To produce a movie with legends is a God sent opportunity for me. And to make a iconic prose into a song, only a legend could do it. I wanted to share this video with you.And brining the song visually is another story altogether; that I will share soon. #sonofindia @themohanbabu pic.twitter.com/Yo0USui7Ys
— Vishnu Manchu (@iVishnuManchu) February 20, 2021
కాగా ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మ్యాస్ట్రో ఇళయ రాజా సంగీతం అందిస్తున్నారు. అంతేకాదు మోహన్ బాబు ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నాడు. మంచు విష్ణు భార్య.. మోహన్ బాబు కోడలు వెరోనికా ఈ సినిమాకు స్టయిలిస్ట్ గా పనిచేస్తున్నారు.




Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.