విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘నాంది’. మొదటిసారి విభిన్నమైన పాత్రతో వస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే టీజర్, ట్రైలర్ లతో సినిమాపై అంచనాలు పెంచేసింది. ఎస్‌వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగ్నేశ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఆ అంచనాలు అందుకుందో లేదో తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు : అల్లరి నరేష్,వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రవీన్, ప్రియదర్శి, హరీష్ ఉత్తమన్, శ్రీకాంత్ అయ్యంగార్, దేవీ ప్రసాద్, వినయ్ వర్మ తదితరులు
డైరెక్టర్ : విజయ్ కనకమేడల
బ్యానర్ : ఎస్వీ2 ఎంటర్‌టైన్మెంట్
నిర్మాత : సతీష్ వేగేశ్న
సంగీతం : శ్రీచరణ్ పాకల
కథ:
మధ్యతరగతి కుటుంబానికి చెందిన సూర్యప్రకాష్(నరేష్) సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ తల్లిదండ్రులతో సంతోషంగా జీవిస్తుంటాడు. తానుప్రేమించిన మీనాక్షిని(వనిత) పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని కలలు కంటుంటాడు. మరోవైపు పేదల తరఫున పోరాడే లాయర్ రాజ్‌గోపాల్ హత్యకు గురవుతాడు. ఆ హత్యనేరంలో సూర్యప్రకాష్‌ను పోలీసులు అరెస్టు చేస్తాడు. కేసుల మీద కేసులు పెట్టి ఐదేళ్ల పాటు సూర్యని బయటకు రాకుండా చేస్తాడు. ఈ క్రమంలో ఆద్య (వరలక్ష్మీ శరత్ కుమార్) ఈ కేసును టేకప్ చేసి సూర్యని నిర్థోషిగా బయటకు తీసుకువస్తుంది. బయటకు వచ్చిన సూర్య తనకు జరిగిన అన్యాయంపై ఏరకంగా పోరాడాడు? అసలు లాయర్ రాజ్‌గోపాల్ ను ఎవరు,ఎందుకు చంపారు? ఈ కేసులో సూర్యని ఏసీపీ కిషోర్ ఎందుకు ఇరికించాడు? అనేది మిగిలిన కథ
విశ్లేషణ
అక్రమంగా కేసు లు పెట్టడం.. సాక్ష్యాలు తారుమారు చేయడం.. వారిని టార్చర్ పెట్టడం ఇలాంటి సంఘటనలు సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా చాలా చూశాం. మరి అలాంటి సెన్సిటివ్ సబ్జెక్టు ను తీసుకొని కథగా మార్చి సినిమా తీసి చూపించడం అంటే మాములు విషయం కాదు. కానీ మొదటి సినిమాకే ధైర్యంగా అలాంటి అడుగు ముందుకేశాడు విజయ్ కనకమేడల. అక్రమంగా నేరం మోపబడిన ఓ వ్యక్తికి న్యాయం చేయడంలో కోర్టులు ఆలస్యం చేయకూడదనే అంశాన్ని ఎంచుకొని దానికి న్యాయశాస్త్రంలో ఉన్న చాలా మందికి అవగాహన లేని ఓ సెక్షన్ జోడిస్తూ సినిమాను రూపొందించాడు. ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 211కు సంబంధించిన కథే ‘నాంది’ సినిమా. కథ,కథనాలు సినిమాకు ఊపిరిపోశాయి. క్లిష్టమైన అంశాన్ని సాధారణ ప్రేక్షకుడికి అర్థమయ్యేలా తెరపై చూపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు.
ఈ సినిమా నా కొత్త సినిమా ప్రయాణానికి నాంది అని ఇప్పటికి చాలా సందర్భాల్లో అల్లరి నరేష్ చెప్పిన సంగతి తెలిసే ఉంటుంది. అల్లరి నరేష్ అంత కాన్ఫిడెంట్ గా వున్నాడు కాబట్టే అలా చెప్పి ఉండొచ్చని ఇప్పుడు సినిమాచూసిన తర్వాత ప్రతి ఒక్కరికీ అర్ధమవుతుంది. నరేష్ నటన గురించి మనకు తెలియంది కాదు. కామెడీ సినిమాలతో ఎలా నవ్వించగలడో.. ఎమోషన్ తో ఏడిపించగలడని గమ్యం తోనే నిరూపించాడు. ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కాడు. ‘నాంది’నరేష్ కెరియర్‌లో ఇదో అద్భతమైన చిత్రంగా నిలిచిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సూర్యప్రకాష్ పాత్రను చేయడానికి ఒప్పుకోవడమే కాకుండా తన సహజ నటనతో నరేష్ ప్రాణంపోశారు. అల్లరి నరేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే స్క్రీన్ పై చూడాల్సిందే.
ఇక లాయర్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఒదిగిపోయింది. ఈ సినిమాలో కూడా తనకు గుర్తుండి పోయే పాత్ర దక్కింది. నరేష్ పాత్ర ఎంత ముఖ్యమో వరలక్ష్మీ పాత్ర కూడా అంతే ముఖ్యమైంది. తన అద్భతమైన నటనతో ఈ సినిమాను మరో హైలైట్ గా నిలిచింది. ఇక ఏసీపీ కిషోర్ అనే నెగెటివ్ పాత్రలో హరీష్ ఉత్తమన్ చాలా బాగా నటించాడు. ఇక ప్రవీణ్, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యంగార్, దేవీ ప్రసాద్, వినయ్ వర్మ తమ పాత్రలపరిధి మేరకు నటించారు.
ఇక ఈ సినిమాలో పాటలు ఉన్నా లేకపోయినా సమస్య లేదు. ఒకవేళ ఉన్నా అనవసరంగా వస్తున్నాయనే ఫీలింగే ఉంటుంది. పాటలు సో సో గా ఉన్నా ఒక శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయాంది. సిధ్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకులకు ఓ మంచి సందేశాత్మక చిత్రం లభించిందని చెప్పొచ్చు.
ఓవరాల్ గా చెప్పాలంటే ఓ మంచి సందేశాత్మక చిత్రం చూసిన ఫీలింగ్ ప్రతి ప్రేక్షకుడికి వస్తుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: