
ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 70


"జాతిరత్నాలు " US రికార్డ్

ఈవారం (మార్చి 26-27) రిలీజ్ సినిమాలు

"అలిమేలు మంగ వేంకటరమణ "మూవీ అప్ డేట్

లక్కీ బ్యూటీ మీనాక్షి చౌదరి

పెద్దోడు ఓకే.. చిన్నోడే..! - రాజమౌళి

మొదటిసారి ఇబ్బంది పడుతున్నా - ఎన్టీఆర్

మహేష్ , సితార ల ఫన్నీ టైమ్

'తెల్లవారితే గురువారం' ట్రైలర్ రిలీజ్

"పుష్ప "మూవీ లో విలన్ ఫాహద్ ఫాజిల్

'హిట్ 2' గ్రాండ్ లాంచ్

"ఖిలాడి "లేటెస్ట్ ఫొటో

రష్మిక బాలీవుడ్ మూవీ "గుడ్ బాయ్ "

'వకీల్ సాబ్' మ్యూజిక్ ఫెస్ట్

"HIT 2"మూవీ హీరో

'తలైవి' ట్రైలర్ కు డేట్ ఫిక్స్..!

'మోసగాళ్ళు' పై సెలబ్రిటీల ప్రశంసలు

నేషనల్ అవార్డ్స్ దక్కించుకున్న జెర్సీ, మహర్షి సినిమాలు
కేంద్రం 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. 2019లో విడుదలైన సినిమాలకు గానూ ఈ అవార్డులను ప్రకటించారు. ఇక ఈ అవార్డ్స్ లో భాగంగా మన తెలుగు సినిమాలు జెర్సీ, మహర్షి సినిమాలు కూడా అవార్డ్స్ ను సొంతం చేసుకున్నాయి.

"జాతిరత్నాలు " US రికార్డ్
నవీన్ పోలిశెట్టి , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ నిర్మాణ సారథ్యంలో అనుదీప్ కె వి దర్శకత్వంలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “జాతిరత్నాలు” మూవీ శివరాత్రి కానుకగా 11 వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. 30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఫరియా అబ్దుల్లా కథానాయిక కాగా మురళీశర్మ , బ్రహ్మానందం , వెన్నెల కిషోర్ , నరేష్ ముఖ్య పాత్రలలో నటించారు. రాధన్ సంగీతం అందించారు.

బోయపాటి దర్శకత్వంలో రామ్ ?
సూపర్ హిట్ "దేవదాసు " మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన రామ్ పోతినేని , తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. అభిమానులు ఎనర్జిటిక్ స్టార్ గా పిలుచుకునే హీరో రామ్ లవర్ బాయ్ ఇమేజ్ నుండి పక్కా మాస్ క్యారెక్టర్ లో అద్భుతం గా పెర్ఫార్మ్ చేసిన "ఇస్మార్ట్ శంకర్ "మూవీ ఘనవిజయం సాధించి హీరోరామ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఈవారం (మార్చి 26-27) రిలీజ్ సినిమాలు
గత శుక్రవారం (మార్చి19)న మోసగాళ్లు, చావు కబుపు చల్లగా, శశి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. మూడు సినిమాలు కూడా మంచి రివ్యూస్ నే సొంత చేసుకున్నాయి. ఇక ఈవారం కూడా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. వాటిలో నితిన్ రంగ్ దే, రానా అరణ్య, శ్రీసింహా తెల్లవారితే గురువారం సినిమాలు ఉన్నాయి. అయితే మార్చి 26న రంగ్ దే, అరణ్య సినిమాలు రిలీజ్ అవుతుండగా. మార్చి 27న తెల్లవారితే గురువారం సినిమా రిలీజ్ కానుంది. మరి ఈసినిమాల్లో ఏ సినిమా హిట్ అవుతుందో తెలియాలంటే మాత్రం మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.

"అలిమేలు మంగ వేంకటరమణ "మూవీ అప్ డేట్
యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ కథానాయకుడిగా టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో "అలిమేలు మంగ వేంకటరమణ "మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. తేజ దర్శకత్వం లో రూపొందిన సూపర్ హిట్ "నిజం ", "జయం " మూవీస్ లోనెగటివ్ రోల్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న గోపీచంద్ ఇప్పుడు "అలిమేలు మంగ వేంకటరమణ "మూవీ లో హీరోగా నటించడం విశేషం.

లక్కీ బ్యూటీ మీనాక్షి చౌదరి
మోడల్ , హర్యానా ఫెమినా మిస్ ఇండియా (2018 )మీనాక్షి చౌదరి "అవుట్ ఆఫ్ లవ్ "హిందీ వెబ్ సిరీస్ ద్వారా కెరీర్ ప్రారంభించారు. సుశాంత్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "ఇచ్చట వాహనములు నిలుప రాదు "మూవీ తో మీనాక్షి కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న యాక్షన్ కామెడీ "ఖిలాడి " మూవీ లో మీనాక్షి కథానాయికగా ఎంపిక అయ్యారు. "ఖిలాడి "మూవీ మే 28 వ తేదీ రిలీజ్ కానుంది.

పెద్దోడు ఓకే.. చిన్నోడే..! - రాజమౌళి
కీరవాణి తనయులు ఇద్దరూ ఇండస్ట్రీలో ఎప్పుడో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెద్ద కొడుకు తనయుడు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను పాడగా ఇప్పుడు పలు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇక చిన్న కొడుకు శ్రీసింహా కూడా మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసినిమాతో వచ్చేస్తున్నారు.

మొదటిసారి ఇబ్బంది పడుతున్నా - ఎన్టీఆర్
మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్, చిత్రా శుక్లా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'తెల్లవారితే గురువారం'. శ్రీ సింహా నటించిన మొదటి సినిమా మంచి హిట్ అవ్వడంతో ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక మార్చి 27వ తేదీన ఈసినిమా రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరగగా ఈకార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి ముఖ్య అతిథిలుగా వచ్చారు.

మహేష్ , సితార ల ఫన్నీ టైమ్
వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. మహేష్ బాబు ప్రస్తుతంబ్లాక్ బస్టర్ "గీత గోవిందం " మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ "సర్కారు వారి పాట " మూవీ లో నటిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. "సర్కారు వారి పాట " మూవీ ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ దుబాయ్ లో కంప్లీట్ చేసుకుని తదుపరి షూటింగ్ షెడ్యూల్ కై సిద్ధం అవుతుంది.

'తెల్లవారితే గురువారం' ట్రైలర్ రిలీజ్
మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్, చిత్రా శుక్లా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'తెల్లవారితే గురువారం'. ఈసినిమా మార్చి 27న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, పలు పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రమోషన్ లో భాగంగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక అక్కడే అతిథిగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగానే ట్రైలర్ విడుదల చేశారు చిత్రయూనిట్.

"పుష్ప "మూవీ లో విలన్ ఫాహద్ ఫాజిల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ ఆగస్ట్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

'హిట్ 2' గ్రాండ్ లాంచ్
శైలేష్ కొలను దర్శకత్వంలో "ఫలక్ నుమా దాస్" మూవీ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన సినిమా "HIT". సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. హీరో నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని, ప్రశాంతి తిపిర్నేని కలిసి సంయుక్తంగా నిర్మించారు.

"ఖిలాడి "లేటెస్ట్ ఫొటో
సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ మే 28 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

రష్మిక బాలీవుడ్ మూవీ "గుడ్ బాయ్ "
టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రష్మిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. "సుల్తాన్ "మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. "ఆడాళ్ళూ మీకు జోహార్లు "మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు.
'ఆర్ఆర్ఆర్'.. చరణ్ బర్త్ డే కి స్పెషల్ పోస్టర్
భీమ్ ఫర్ రామరాజు ఈ వీడియో వచ్చి ఏడాది అవుతుంది. గత ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ చరణ్ ఇంట్రడక్షన్ వీడియోను రిలీజ్ చేశాడు. ఇక అప్పుడే ఏడాది అవుతుంది. మరో వారం రోజుల్లో రామ్ చరణ్ పుట్టిన రోజు రానుంది. ఇక ఈపుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ కు సంబంధించిన ఏదైనా అప్ డేట్ వస్తుందా లేదా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా కూడా అప్ డేట్ ఉందా లేదా అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఇక ఇప్పుడు ఈవిషయంలో తాజాగా ఒక అప్ డేట్ ఇచ్చి క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్. చరణ్ పుట్టినరోజు నాడు రామరాజు కు సంబంధించి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా…

'వకీల్ సాబ్' మ్యూజిక్ ఫెస్ట్
మొత్తానికి థమన్ చెప్పినట్టే మార్చి నెల మొత్తాన్ని మ్యూజికల్ ఫెస్ట్ గా మార్చేశారు వకీల్ సాబ్ చిత్రయూనిట్. గత ఏడాది మగువ మగువ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ నెలలో సత్యమేవ జయతే.. రీసెంట్ గా కంటి పాప. కంటిపాప అనే రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేశారు. మూడు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఏకంగా మ్యూజిక్ ఫెస్ట్ ను ఏర్పాటు చేశారు దర్శక నిర్మాతలు. ఈనేపథ్యంలో దుండిగల్‌లోని MLRIT కాలేజీలో ఈరోజు మధ్యాహ్నం నుండి మ్యూజిక్ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు.

"HIT 2"మూవీ హీరో
వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై హీరో నాని , తిపిర్నేని ప్రశాంతి నిర్మాణ సారథ్యం లో శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ "HIT :ది ఫస్ట్ కేస్ "మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. నూతన దర్శకుడు శైలేష్ "HIT "మూవీ ని తెరకెక్కించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఆ మూవీ కి సీక్వెల్ "HIT 2 " మూవీ తెరకెక్కనుంది.

'తలైవి' ట్రైలర్ కు డేట్ ఫిక్స్..!
కంగనా ప్రధాన పాత్రలో ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. జయలలిత రీల్ లైఫ్ , రియల్ లైఫ్ ముఖ్య సంఘటనలు ఈ సినిమాలో చూపించనున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి పలు పోస్టర్స్ రిలీజ్ చేయగా అవి ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ మూవీని జయలలిత జయంతి సందర్భంగా ఏప్రిల్ 23న విడుదల చేయనున్నట్టు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.

'మోసగాళ్ళు' పై సెలబ్రిటీల ప్రశంసలు
ఫైనల్లీ మంచు విష్ణు ఖాతాలో ఒక హిట్ పడింది. ఈహిట్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఆప్పుడెప్పుడో హిట్ అన్న మాట విన్నాడు. ఈమధ్య ఎన్ని సినిమాలు చేసినా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి తప్పా సరైస సక్సెస్ ను అందించలేకపోయాయి. ఇక ఈసారి తన రూట్ మార్చి తానే నిర్మాతగా మారి మోసగాళ్ళు లాంటి సినిమాతో వచ్చాడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై విష్ణు మంచు నిర్మాతగా వ్యవహరించారు. ఈసినిమా మంచు విష్ణు నమ్మకాన్ని నిలబెట్టింది అని చెప్పొచ్చు. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో.. ఆన్ లైన్ స్కామ్ ల నేపథ్యంలో…

'జీ5' లో నిన్నిలా నిన్నిలా
ఒకప్పుడు సినిమా రిలీజ్ అయి ఓటీటీ లోకి రావాలంటే కనీసం ఒక రెండు నెలలైనా టైమ్ పట్టేది. కానీ ఇప్పుడు అలా కాదు.. థియేటర్లలోకి వచ్చిన వారంరోజుల్లోనే కొన్ని సినిమాలు ఓటీటీలో దర్శనమిచ్చేస్తున్నాయి. అందుకే కొన్ని సినిమాలు అయితే నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయడానికి ముందుకువస్తున్నారు. ఇదిలా ఉండగా.. అనీ శశి దర్శకత్వంలో.. అశోక్ సెల్వన్, నిత్యా మీనన్, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘నిన్నిలా నిన్నిలా’. ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరిలో ‘జీ ప్లెక్స్’లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈసినిమా మంచి పాజిటివ్ రివ్యూస్ నే సొంతం చేసుకుంది.