స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ ఆగస్ట్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“పుష్ప “మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో రూపొందించిన ప్రత్యేక సెట్ లో జరుగుతుంది. నెలాఖరు వరకూ జరిగే ఈ షూటింగ్ షెడ్యూల్ లో హీరో అల్లు అర్జున్ , హీరోయిన్ రష్మిక , ఇతర నటీనటులపై పలు సన్నివేశాలను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు.”పుష్ప “మూవీ లో ప్రతినాయకుడిగా మలయాళ స్టార్ హీరో , నేషనల్ అవార్డ్ విన్నర్ ఫాహద్ ఫాజిల్ ఎంపిక అయినట్టుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ తో ఫాహద్ ఫాజిల్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. బ్లాక్ బస్టర్ “అల .. వైకుంఠపురములో ..” మూవీ తరువాత అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న “పుష్ప “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























