భీమ్ ఫర్ రామరాజు ఈ వీడియో వచ్చి ఏడాది అవుతుంది. గత ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ చరణ్ ఇంట్రడక్షన్ వీడియోను రిలీజ్ చేశాడు. ఇక అప్పుడే ఏడాది అవుతుంది. మరో వారం రోజుల్లో రామ్ చరణ్ పుట్టిన రోజు రానుంది. ఇక ఈపుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ కు సంబంధించిన ఏదైనా అప్ డేట్ వస్తుందా లేదా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా కూడా అప్ డేట్ ఉందా లేదా అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఇక ఇప్పుడు ఈవిషయంలో తాజాగా ఒక అప్ డేట్ ఇచ్చి క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్. చరణ్ పుట్టినరోజు నాడు రామరాజు కు సంబంధించి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Unleashing @AlwaysRamCharan‘s FIERCEST avatar as Ramaraju for his birthday with a new poster! 🔥🔥#RRRMovie
RAMA RAJU aRRRiving
— RRR Movie (@RRRMovie) March 20, 2021
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.
ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: