‘తలైవి’ ట్రైలర్ కు డేట్ ఫిక్స్..!

Kangana Ranaut Starrer Thalaivi Movie Teaser Release Date Is Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kangana Ranaut,Actress Kangana Ranaut,Heroine Kangana Ranaut,Kangana Ranaut Thalaivi,Thalaivi,Thalaivi Movie,Thalaivi Film,Thalaivi Movie News,Thalaivi Update,Thalaivi Movie Latest News,Thalaivi Movie Latest Updates,Thalaivi Teaser,Thalaivi Movie Teaser,Thalaivi Film Teaser,Kangana Ranaut Starrer Thalaivi Movie Teaser,Kangana Ranaut Thalaivi Teaser,Thalaivi Teaser Update,Thalaivi Teaser News,Thalaivi Movie Teaser Release Date,Kangana Ranaut Thalaivi Teaser Release Date,Thalaivi Teaser Release Date Fix,Thalaivi Movie Teaser Release Date Announced,Thalaivi Movie Teaser Release Date Out,Thalaivi Movie Teaser Release Date Confirmed,Thalaivi Teaser On 23rd April

కంగనా ప్రధాన పాత్రలో ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. జయలలిత రీల్ లైఫ్ , రియల్ లైఫ్ ముఖ్య సంఘటనలు ఈ సినిమాలో చూపించనున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించి పలు పోస్టర్స్ రిలీజ్ చేయగా అవి ఆక‌ట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ మూవీని జ‌య‌ల‌లిత జ‌యంతి సంద‌ర్భంగా ఏప్రిల్ 23న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఇటీవలే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. మార్చి 23న కంగనా రనౌత్‌ పుట్టినరోజు సందర్భంగా ‘తలైవి’ ట్రైలర్‌ను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. చెన్నై, ముంబై రెండు నగరాలలో ‘తలైవి’ ట్రైలర్‌ను రిలీజ్‌ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

కాగా ఇంకా ఈ సినిమాలో అరవింద్ స్వామి , ప్రకాష్ రాజ్ , భాగ్యశ్రీ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. విష్ణు వర్ధన్‌ ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌తో కలిసి విబ్రీ మోషన్‌ పిక్చర్స్‌, కర్మ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రైటర్ గా పనిచేస్తున్న ఈ మూవీ కి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =