కేంద్రం 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. 2019లో విడుదలైన సినిమాలకు గానూ ఈ అవార్డులను ప్రకటించారు. ఇక ఈ అవార్డ్స్ లో భాగంగా మన తెలుగు సినిమాలు జెర్సీ, మహర్షి సినిమాలు కూడా అవార్డ్స్ ను సొంతం చేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన సినిమా జెర్సీ. జెర్సీ సినిమాలో తన నట విశ్వరూపం చూపించాడు నాని. అర్జున్ పాత్రలో నాని చేసిన నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. క్రికెట్‌ను వదిలేసి, ప్రభుత్వ ఉద్యోగం పోయి పనిపాటా లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటూ.. ఆ తర్వాత కొడుకు కోసం క్రికెట్ ఆడటం సినిమా మొత్తం ఒక ఎమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు. ఇక ఈసినిమాకు గాను జాతీయ ఉత్తమ సినిమాగా అవార్డ్ దక్కింది. అంతేకాదు ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో ‘జెర్సీ’ చిత్రానికి ఎడిటర్‌గా వ్యవహరించిన నవీన్ నూలి అవార్డు దక్కించుకున్నారు.
ఇక వంశీపైడిపల్లి దరశకత్వంలో మహేష్ హీరోగా వచ్చిన సినిమా మహర్షి. ఈసినిమా కూడా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సినిమా. ఇక ఈసినిమా కూడా మూడు అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా “మహర్షి” సినిమా అవార్డు సొంతం చేసుకుంది. దీనితో పాటు ఉత్తర కొరియోగ్రాఫర్ గా రాజు సుందరం(మహర్షి)అవార్డును దక్కించుకున్నారు. ఉత్తమ నిర్మాణ సంస్థ కెటగిరీలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ కు అవార్డ్ దక్కింది.
67వ జాతీయ చలన చిత్ర అవార్డులు..
ఉత్తమ తెలుగు చిత్రం- జెర్సీ
ఉత్తమ ఎడిటర్ – జెర్సీ(నవీన్ నూలీ)
ఉత్తమ వినోదాత్మక చిత్రం- మహర్షి
ఉత్తమ కొరియోగ్రాఫర్- రాజుసుందరం(మహర్షి)
ఉత్తమ నిర్మాణ సంస్థ- శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్(మహర్షి)
ఉత్తమ నటుడు: ధనుష్(అసురన్), మనోజ్ బాజ్‌పాయ్(భోంస్లే)
ఉత్తమ నటి: కంగనా రనౌత్(మణికర్ణిక/పంగా)
ఉత్తమ దర్శకుడు: బహత్తార్ హూరైన్
ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి(ది తాష్కెంట్ ఫైల్స్)
ఉత్తమ సహాయ నటుడు: విజయ్ సేతుపతి(సూపర్ డీలక్స్)
ఉత్తమ చిత్రం(హిందీ): చిచ్చోరే
ఉత్తమ చిత్రం(తమిళం): అసురన్
ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: మరక్కర్ అరబ్(మలయాళం)
ఉత్తమ సంగీత దర్శకుడు: జ్యేష్టపుత్రో
ఉత్తమ మేకప్: హెలెన్
ఉత్తమ గాయకుడు: కేసరి (తేరీ మిట్టీ)
ఉత్తమ గాయని: బర్దో(మరాఠీ)
![Video thumbnail](https://img.youtube.com/vi/tHlFCUtpfkA/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/og_4GC7Swpc/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/EOw-oU_HNVA/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/1kJSL8cYbyU/default.jpg)
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)