
ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 71


డబ్బింగ్ థియేటర్ లో డైరెక్టర్ తో తమన్నా

'రంగ్ దే' ట్రైలర్ రిలీజ్

లక్కీ హైదరాబాదీ గర్ల్ ఫరియా అబ్దుల్లా

ట్రెండింగ్ లో మోహన్ బాబు బర్త్ డే సీడీపీ

శశి మూవీ పబ్లిక్ టాక్

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రంగ్ దే'

చావు కబురు చల్లగా మూవీ పబ్లిక్ టాక్

మోసగాళ్లు మూవీ పబ్లిక్ టాక్

'ఆచార్య' బ్యాక్ డ్రాప్ అదే

మాల్దీవుల్లో "సాహో "బ్యూటీ శ్రద్ధా కపూర్

హీలియం బెలూన్స్ తో "వకీల్ సాబ్ " ప్రమోషన్

విలన్ పాత్రలంటే ఇష్టం - కార్తికేయ

'మోసగాళ్ళు' టీమ్ కు మహేష్ బెస్ట్ విషెస్

'విరాట పర్వం' టీజర్ రిలీజ్

"పుష్ప "మూవీ అప్ డేట్

హీరో బాలకృష్ణ పై ప్రగ్య జైస్వాల్ ప్రశంసలు

'పచ్చీస్' టీజర్ రిలీజ్

"ఢీ " సీక్వెల్ అప్ డేట్
సిరి వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్ పై శ్రీను వైట్ల దర్శకత్వంలో విష్ణు మంచు , జెనీలియా జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "ఢీ "మూవీఘనవిజయం సాధించింది. శ్రీహరి , చంద్ర మోహన్ , బ్రహ్మానందం ముఖ్య పాత్రలలో నటించారు. చక్రి సంగీతం అందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా దర్శకుడు శ్రీను వైట్ల "ఢీ "మూవీ ని తెరకెక్కించారు. తమిళ , బెంగాలీ భాషలలో రీమేక్ జరుపుకుని "ఢీ "మూవీ విజయం సాధించింది.

డబ్బింగ్ థియేటర్ లో డైరెక్టర్ తో తమన్నా
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ , తమన్నా జంటగా కబడ్డీ నేపథ్యం లో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా "సీటీమార్ "మూవీ ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది. దిగాంగన , భూమిక , రెహమాన్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. "సీటీమార్ "మూవీలో గోపీచంద్ , తమన్నా లు కబడ్డీ కోచ్ లుగా నటించారు. స్టార్ హీరోయిన్ తమన్నా ఫస్ట్ టైమ్ స్పోర్ట్స్ డ్రామా మూవీ లో నటించడం విశేషం.

'రంగ్ దే' ట్రైలర్ రిలీజ్
గత ఏడాది ‘భీష్మ’ తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న నితిన్ ఈ ఏడాది ‘చెక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు రంగ్ దే సినిమాతో వస్తున్నాడు. యంగ్ హీరో నితిన్, కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం రంగ్ దే. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా మార్చి 26న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇక పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఇక తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ నురిలీజ్ చేశారు.

లక్కీ హైదరాబాదీ గర్ల్ ఫరియా అబ్దుల్లా
స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ నిర్మాణ సారథ్యంలో అనుదీప్ కె వి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “జాతిరత్నాలు” మూవీ శివరాత్రి కానుకగా 11 వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. ఫరియా అబ్దుల్లా కథానాయిక. “జాతిరత్నాలు” మూవీ 30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

ట్రెండింగ్ లో మోహన్ బాబు బర్త్ డే సీడీపీ
హీరో , విలన్ , కామెడీ విలన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు బ్లాక్ బస్టర్ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన మోహన్ బాబు విలక్షణ నటుడు , కలెక్షన్ కింగ్ గా పేరుపొందారు. ఈ రోజు మోహన్ బాబు తన 69 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అద్భుతమైన డైలాగ్ డెలివరీ , పెర్ఫార్మెన్స్ తో నాలుగున్నర దశాబ్దాలుగా మోహన్ బాబు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. 500 మూవీస్ కు పైగా నటించిన మోహన్ బాబు "పద్మశ్రీ "అవార్డ్ అందుకున్నారు.

శశి మూవీ పబ్లిక్ టాక్
శ్రీనివాస్ నాయుడు నడికట్ల డైరెక్షన్లో ఆది హీరోగా ‘శశి’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ,ట్రైలర్ ల వల్ల ఈ సినిమాపై అంచనాలు కూడా బాగానే పెరిగాయి. ఇక మార్చి 19న ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా స్పీడు పెంచారు. కాగా లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సురభి, రాశీ సింగ్ హీరోయిన్లు గా నటిస్తుండగా రాజీవ్ కనకాల, జయప్రకాష్, అజయ్, వెన్నెల కిషోర్, రాశి సింగ్, తులసి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు…

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రంగ్ దే'
ఈమధ్య నితిన్ డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. రీసెంట్ గానే చెక్ లాంటి డిఫెరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నితిన్ ఇప్పుడు రంగ్ దే లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న సినిమా 'రంగ్ దే'. మార్చి 26వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ పలు పాటలు కూడా రిలీజ్ చేయగా నేడు ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నారు. దీనికోసం కర్నూల్ లో ఓ కార్యక్రమం కూడా నిర్వహించారు.

చావు కబురు చల్లగా మూవీ పబ్లిక్ టాక్
కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘చావు కబురు చల్లగా’. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజుగా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి ‘బస్తి బాలరాజు’ ఫస్ట్ లుక్, టీజర్ గ్లిమ్ప్స్, మైనేమ్ ఈజ్ రాజు పాటను విడుదల చెయ్యగా వాటికి మంచి స్పందన లభించింది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గరపడుతున్న నేపథ్యంలో మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా గట్టిగానే చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో మురళీ శర్మ, ఆమని, శ్రీకాంత్ అయ్యంగర్, మహేష్,భద్రం తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు…

మోసగాళ్లు మూవీ పబ్లిక్ టాక్
హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో వస్తున్న చిత్రం ‘మోసగాళ్ళు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ తో సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేశారు చిత్రయూనిట్. ఇక మార్చి 19న ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. నవదీప్, నవీన్ చంద్ర, రుహాని సింగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోంది. తెలుగు…

'ఆచార్య' బ్యాక్ డ్రాప్ అదే
మెగాస్టార్ చిరు ఈమధ్య తన సినిమా లో సస్పెన్స్ ఎలిమెంట్స్ ను ముందుగానే చెప్పేస్తున్నారు. అసలు ఆచార్య టైటిల్ ను ఎలా చెప్పేశారో గుర్తుండే ఉంటుంది కదా. పాపం కొరటాలశివ చాలా గ్రాండ్ గా సస్పెన్స్ తో ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేద్దామనుకుంటే ఓ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కువచ్చిన ఆయన ఎగ్జైట్ మెంట్ తో సినిమా టైటిల్ ను చెప్పేశాడు.

మాల్దీవుల్లో "సాహో "బ్యూటీ శ్రద్ధా కపూర్
ప్రముఖ నటుడు శక్తి కపూర్ తనయ శ్రద్ధా కపూర్ "తీన్ పత్తి "మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించారు. "ఆషికి 2 ", "ఏక్ విలన్ ", "బాఘీ ", స్త్రీ ", "ఓకే జాను ", "బాఘీ 3", "చిచ్చోరే "వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో శ్రద్ధా కపూర్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "సాహో "మూవీ తో శ్రద్ధా కపూర్ టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. నటి గానే కాకుండా సింగర్ గా శ్రద్ధా కపూర్ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

అమెజాన్ లోకి వచ్చేసిన 'గాలి సంపత్'
అనీష్ కృష్ణ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్- శ్రీ విష్ణు ప్రధానపాత్రల్లో వచ్చిన సినిమా గాలి సంపత్. మహాశివరాత్రి కానుకగా రిలీజ్ అయిన సినిమాల్లో గాలి సంపత్ సినిమా కూడా ఒకటి. మొదటి నుండి ఈసినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టే సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి బ్రాండ్.. రాజేంద్రప్రసాద్-శ్రీవిష్ణు కాంబినేషన్ సినిమాకు బాగా కలిసొచ్చింది. తండ్రిగా రాజేంద్ర ప్రసాద్.. కొడుకుగా శ్రీవిష్ణు చేయడమే సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. వీరిద్దరి నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్సే రాబడుతూ రన్ అవుతుంది.

హీలియం బెలూన్స్ తో "వకీల్ సాబ్ " ప్రమోషన్
బోనీ కపూర్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,శృతి హాసన్ జంటగా రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 9 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నివేద థామస్ , అంజలి , అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ ” మూవీ కి తెలుగు రీమేక్ గా “వకీల్ సాబ్ “మూవీ రూపొందింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

విలన్ పాత్రలంటే ఇష్టం - కార్తికేయ
"ప్రేమ తో మీ కార్తీక్ "మూవీ తో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన కార్తికేయ సూపర్ హిట్ "RX 100 "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి గుర్తింపు పొంది ప్రేక్షకులను ఆకట్టుకుని క్రేజీ హీరోగా మారారు. "హిప్పీ ", "గుణ 369 ", "90 ML "మూవీస్ తో కార్తికేయ ప్రేక్షకులను అలరించారు. నాని హీరోగా రూపొందిన "గ్యాంగ్ లీడర్ "మూవీ లో కార్తికేయ నెగటివ్ రోల్ లో నటించిన విషయం తెలిసిందే.

'మోసగాళ్ళు' టీమ్ కు మహేష్ బెస్ట్ విషెస్
హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో వస్తున్న చిత్రం ‘మోసగాళ్ళు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో పాటు వరుస ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. అంతేకాదు ఈసినిమా విజయం కోసం మంచు విష్ణు కూడా అంతే ఈగర్ గా వైయిట్ చేస్తున్నాడు.

ఈ దశాబ్దపు మోస్ట్ వైరల్ సాంగ్ "బుట్టబొమ్మ "
గీతా ఆర్ట్స్ , హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "అల .. వైకుంఠపురములో .. " మూవీ 2020 సంవత్సరం జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. టబు , సుశాంత్ , నివేత పేతురాజ్, సముద్ర ఖని , రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

'విరాట పర్వం' టీజర్ రిలీజ్
యంగ్ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. నీదీ నాదీ ఒకే కథ అనే చిత్రంతో అందరి ప్రశంసలు దక్కించుకున్న వేణు ఉడుగుల ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో ఈసినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి. యదార్ధ సంఘటనల ఆధారంగా 1990’s నాటి విప్లవ కథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి వదిలిన పోస్టర్లు, ఫస్ట్ గ్లింప్స్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. అంతేకాదు ఇటీవలే రిలీజ్ చేసిన కోలు కోలు సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.

"పుష్ప "మూవీ అప్ డేట్
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. "పుష్ప "మూవీ ఆగస్ట్ 13 వ తేదీ రిలీజ్ కానుంది.

హీరో బాలకృష్ణ పై ప్రగ్య జైస్వాల్ ప్రశంసలు
దర్శకుడు బోయపాటి శ్రీను , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన "సింహా ", "లెజెండ్ " మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ “BB3 “మూవీ రూపొందుతుంది. హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో బాలకృష్ణ నటిస్తున్న అఘోరా పాత్ర “BB3″మూవీ కి హైలైట్ కానుందని సమాచారం.

'పచ్చీస్' టీజర్ రిలీజ్
శ్రీకృష్ణ, రామసాయి దర్శకత్వంలో రామ్స్, శ్వేతావర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘పచ్చీస్'. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా ఎంతో మంది సెలబ్రిటీస్ కు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. ఇక కాస్ట్యూమ్ డిజైనర్ అయిన రామ్స్ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేయగా అవి బాగానే ఆకట్టుకున్నాయి.