నవీన్ పోలిశెట్టి , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ నిర్మాణ సారథ్యంలో అనుదీప్ కె వి దర్శకత్వంలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “జాతిరత్నాలు” మూవీ శివరాత్రి కానుకగా 11 వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. 30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఫరియా అబ్దుల్లా కథానాయిక కాగా మురళీశర్మ , బ్రహ్మానందం , వెన్నెల కిషోర్ , నరేష్ ముఖ్య పాత్రలలో నటించారు. రాధన్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“జాతిరత్నాలు “మూవీ ఘన విజయం సాధించడంతో ఆ మూవీ లో నటించిన హీరో నవీన్ , హీరోయిన్ ఫరియా అబ్దుల్లా పలు మూవీ ఆఫర్స్అందుకుంటున్నారు . “జాతి రత్నాలు “మూవీ US లో కూడా రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది. నేటి తో”జాతి రత్నాలు “మూవీ వన్ మిలియన్ మార్క్ చేరుకొంటుంది. ఒక చిన్న సినిమా ప్రేక్షకాదరణ పొంది ఇంతటి ఘనవిజయం సాధించడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: