‘తెల్లవారితే గురువారం’ ట్రైలర్ రిలీజ్

Thellavarithe Guruvaram Movie Trailer Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Jr NTR,Young Tiger NTR,Thellavarithe Guruvaram Movie Trailer,Sri Simha,Kaala Bhairava,Misha Narang,Chitra Shukla,Thellavarithe Guruvaram Movie Latest Trailer,Thellavarithe Guruvaram Trailer,Jr Ntr Speech Thellavarithe Guruvaram,Thellavarithe Guruvaram Telugu Movie Trailer,Thellavarithe Guruvaram 2021 Telugu Movie,Thellavarithe Guruvaram Songs,Thellavarithe Guruvaram Telugu Movie Latest Trailer,Sri Simha Movies,Sri Simha New Movie Trailer,Thellavarithe Guruvaram,Thellavarithe Guruvaram Movie,Thellavarithe Guruvaram Telugu Movie,Thellavarithe Guruvaram Trailer Launch,Thellavarithe Guruvaram Trailer Out,Thellavarithe Guruvaram Trailer Released,Sri Simha Thellavarithe Guruvaram Trailer,Thellavarithe Guruvaram Trailer Released By Jr NTR,#ThellavaritheGuruvaramTrailer​

మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్‌, చిత్రా శుక్లా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘తెల్లవారితే గురువారం’. ఈసినిమా మార్చి 27న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, పలు పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రమోషన్ లో భాగంగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక అక్కడే అతిథిగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగానే ట్రైలర్ విడుదల చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ట్రైలర్ ను బట్టి ఈసినిమా కూడా కామెడీ ప్రధానంగా సాగేటట్టు కనిపిస్తుంది. ఇక మత్తువదలరా సినిమాకు సత్య ఎలా ప్లస్ పాయింట్ అయ్యాడో.. ఎలా నవ్వాడో.. ఈసినిమాలో కూడా సత్య కామెడీ మార్క్ ను చూపించాడు. ట్రైలర్ అంతా పెళ్లి, దాన్ని తప్పించుకోడానికి హీరో చేసే ప్రయత్నాల చుట్టూనే సాగింది. సినిమా మొత్తం ఒక్క రాత్రిలో జరిగే కథలా కనిపిస్తుంది. ఈ సినిమాతో కూడా సింహా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాడు. మొదటి సినిమా థ్రిల్లర్ సబ్జెక్ట్ తో రాగా రెండో సినిమా రొమాంటిక్ కామెడీతో వస్తున్నాడు.

ఇంకా ఈ సినిమాలో రాజీవ్ క‌న‌కాల‌, స‌త్య, అజ‌య్‌, వైవా హ‌ర్ష, శ‌ర‌ణ్యా ప్రదీప్‌, గిరిధ‌ర్‌, ప్రియ‌, ర‌వివ‌ర్మ, పార్వతి, సిరి హ‌నుమంత్‌, మౌర్య, ప‌ద్మావ‌తి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘క‌ల‌ర్ ఫొటో’ లాంటి మంచి సినిమాను అందించిన లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ ఇప్పుడు వారాహి చలన చిత్రంతో కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ర‌జనీ కొర్రపాటి, ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పనేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘మత్తు వదలరా’ సినిమాతోనే సంగీత దర్శకుడిగా పరిచయమైన కాలభైరవానే ఈ సినిమాకు కూడా సంగీతం అందించనున్నాడు. సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.