టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రష్మిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. “సుల్తాన్ “మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “ఆడాళ్ళూ మీకు జోహార్లు “మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
“మిషన్ మజ్ను “మూవీ తో స్టార్ హీరోయిన్ రష్మిక బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. రష్మిక ప్రస్తుతం “మిషన్ మజ్ను “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆ మూవీ రిలీజ్ కాకుండానే రష్మిక మరో బాలీవుడ్ మూవీ లో కథానాయికగా ఎంపిక కావడం విశేషం. వికాస్ దర్శకత్వంలో బిగ్ బీ అమితాబ్ ప్రధాన పాత్రలో “గుడ్ బాయ్ “మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో అమితాబ్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఆయన కూతురి పాత్రలో రష్మిక నటిస్తున్నారు. ముంబై లో రూపొందించిన ప్రత్యేక సెట్ లో “గుడ్ బాయ్ ” మూవీ షూటింగ్ మార్చి 29 వ తేదీ ప్రారంభం కానుంది.
[subscribe]
![Video thumbnail](https://img.youtube.com/vi/DcBcSnO6uyE/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/BIXDgR9V5sE/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/cK639mJlOg8/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/qyYI9Oet6uI/default.jpg)
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)